Saturday, May 18, 2024
- Advertisement -

చిరు కాఫీ కావాలా?

- Advertisement -
  • మెగా కోడ‌లు కాఫీషాప్ ప్రారంభం

మీరు ఇన్ని రోజులు చిరంజీవి పేరిట ఉన్న దోశ‌లు తిని ఉంటారు. లేదా విని ఉంటారు. ఇప్పుడు చిరంజీవి పేరిట ఓ కాఫీ వ‌చ్చేసింది. మీరు చిరు ఫ్యాన్ అయితే వెంట‌నే వెళ్లి చిరు కాఫీ తాగేసేయ్యండి. కేవ‌లం రూ.20ల‌కు మాత్ర‌మే ల‌భించే కాఫీ ఇది ఎక్క‌డా దొర‌క‌దు. కేవ‌లం ఒకే ఒక చోట ల‌భిస్తుంది. ఒక్క‌డకు వెళ్లి మీరు ఎంచ‌క్కా మీ అభిమాన తార పేరిట ఉన్న కాఫీ.. ఆ టేస్ట్‌ను ఎంజాయ్ చేసేయొచ్చు. ఆ వివ‌రాలేంటి చూడండి. ఇటీవ‌ల మెగా కోడ‌లు ఉపాస‌న త‌న మావ‌య్య (చిరంజీవి)కు, భ‌ర్త (రామ్‌చ‌ర‌ణ్‌తేజ‌)కు ఏయే కాఫీ ఇష్ట‌మో.. అది ఎలా త‌యారు చేస్తారో చెబుతూ ఓ వీడియో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది ఉత్తి వీడియోనే అనుకున్నాం. ఆ కాఫీతోనే ఓ కాఫీషాప్ పెట్టేసింది.

అపోలో ఫౌండేషన్‌ తరపున ఉపాసన ఓ కాఫీ షాప్ మొద‌లు పెట్టేశారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లో డిసెంబ‌ర్ 1వ తేదీన కేఫ్‌ పేరిట ఈ కాఫీషాప్‌ను ప్రారంభించారు ఉపాసన. ఈ విషయాన్ని ఉపాసన స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపారు. హే.. ఈ కేఫ్‌కి వచ్చి రిలాక్స్ అవ్వండి అని ఉపాస‌న పోస్ట్ చేసింది. అక్కడ దొరికే ఆహార పదార్థాలు.. వాటి రేట్లను సూచించే మెనూను పెట్టారు. అందులో చిరు కాఫీ కూడా ఉంది. కేవ‌లం 20 రూపాయ‌ల‌కే చిరు ఫిల్ట‌ర్ కాఫీ దొరుకుతుంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -