Thursday, May 16, 2024
- Advertisement -

ఎనిమిది వికెట్లు కోల్పోయిన శ్రీలంక‌….

- Advertisement -

మూడో టెస్టులో శ్రీలంక పోరాడుతోంది. ఏంజెలా మాథ్యూస్ (111) సెంచరీకి తోడు కెప్టెన్ దినేశ్ చండిమాల్ అద్భుత పోరాటం తోడవడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు ధీటైన జవాబు ఇస్తోంది. మరోవైపు భారత టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన పని ప్రారంభించాడు. మాథ్యూస్, చండిమాల్ సుధీర్ఘ భాగస్వామ్యాన్ని విడగొట్టి శ్రీలంకకు గట్టి దెబ్బ కొట్టాడు. అశ్విన్ వేసిన ఓ చక్కటి బంతికి మాథ్యూస్ ఔటయ్యాడు. కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 181 పరుగుల భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది.

ఆ తరవాత క్రీజులోకి వచ్చిన సమరవిక్రమ(33)తో కలసి చండిమాల్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఆతితూచి ఆడుతూ సెంచరీ పూర్తి చేశాడు. వీరి భాగస్వామ్యా్న్ని ఇషాంత్ శర్మ విడగొట్టాడు. ఇషాంత్ బౌలింగ్‌లో కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి సమరవిక్రమ ఔటయ్యాడు. ఆ తరవాత రోషన్ సిల్వ (0), డిక్వెల్లా (0)లను ఖాతా తెరవనివ్వకుండానే అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో శ్రీలంక కష్టాల్లో పడింది.

ఆ తరవాత వచ్చిన లక్మల్ (5) కూడా క్రీజులో ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. షమీ బౌలింగ్‌లో సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో శ్రీలంక 332 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో చండిమాల్ (133 నాటౌట్), లహిరు గమగే (1 నాటౌట్) ఉన్నారు. 125 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -