Thursday, May 16, 2024
- Advertisement -

సోషియ‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న చ‌ర‌ణ్ మూవీ స్టిల్స్‌..

- Advertisement -

ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎంత జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా సినిమాకి సంబంధించిన ఔట్‌పుట్ బ‌య‌ట‌కు రాకుండా అడ్డుక‌ట్ట వేయ‌లేక‌పోతున్నారు. గ‌తంలో అనేక సినిమాల‌కు సంబంధించిన స్టిల్స్‌, సీన్స్ బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెల‌సిందే. తాజాగా తాజాగా రామ్ చ‌ర‌ణ్ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

దాదాపు అన్ని చిత్రాలకు సంబంధించి ఫొటోలు, వీడియోలు బయటకు వస్తూనే ఉన్నాయి. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చరణ్ తాజా చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో చరణ్ సరసన కైరా అద్వానీ నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, ఆర్యన్ రాజేష్, సుదీప్, తమిళ హీరో ప్రశాంత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం సింహాచలం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలకు చెందిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఫోటోల‌ని బ‌ట్టి చూస్తుంటే ఇవి యాక్ష‌న్ సీన్‌కి సంబంధించిన‌విగా అర్ద‌మ‌వుతుంది. ద‌సరా కానుక‌గా చిత్ర ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేయ‌నున్నార‌ని అంటున్నారు.

ఈ సినిమాకు విన‌య విధేయ రామ అనే టైటిల్‌ని చిత్రానికి ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం.క‌న్న‌డ హీరో సుదీప్‌ ఈ సినిమాలోను విల‌న్‌గా క‌నిపిస్తాడ‌ని అంటున్నారు. ఇక‌ చరణ్ అన్న పాత్రల్లో కోలీవుడ్ హీరో ప్రశాంత్‌ (జీన్స్‌ ఫేం), నవీన్‌ చంద్ర లు నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -