Saturday, May 4, 2024
- Advertisement -

మ‌హిళ లైంగిక వేధింపులు తాల‌లేక వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య

- Advertisement -

మహిళలు లైంగిక వేధింపులకు గురికావడం విధిలేని ప‌రిస్థితుల్లో ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయితే ఇక్క‌డ మాత్రం సీన్ రివ‌ర్స్ అయ్యింది. ఓ మహిళ సెక్స్ కోసం ఒత్తిడి చేస్తుండడంతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పదే పదే సెక్స్ కోసం ఆమె ఒత్తిడి పెట్టడంతో అతను బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. మహారాష్ట్రంలో పర్భాని జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సచిన్ మిత్కారి (38) అనే వ్యక్తి పని చేస్తున్నాడు. అక్కడే పని చేస్తున్న ఓ మహిళతో సన్నిహితంగా మెలిగాడు. అతనికి అప్పటికే పెళ్లి అయింది. ఈ విషయం తెలిసి కూడా సదరు మహిళ అక్రమ సంబంధాన్ని కొనసాగించాలని అతన్ని బలవంతపెట్టింది. అందుకు అతను అంగీకరించలేదు. దీంతో, ఆమె అతన్ని వేధించడం మొదలు పెట్టింది. అక్రమ సంబంధాన్ని కొనసాగించకపోతే… లైంగిక వేధింపుల కేసు పెడతానంటూ బెదిరించింది.

ఆమె వేధింపులు తాల‌లేక – విస్మాత్ రోడ్డులోని తన ఇంటి పైకప్పునకు వేలాడుతూ ఆదివారం అతను కనిపించాడు.మృత దేహాన్ని చూసిన ఇరుగుపొరుగు వారు… పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు.

ఈ సందర్భంగా సచిన్ జేబులో ఉన్న ఒక లేఖను స్వాధీనం చేసుకున్నారు. మహిళ లైంగిక వేధింపులను భరించలేకే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు లేఖలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశామని, లేఖ ఆధారంగా దర్యాప్తు చేపడతామని పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -