Wednesday, May 15, 2024
- Advertisement -

ఏం చూపించిందో తెలియ‌దు కాని …శ్రీరెడ్డి ఛాన్స్ ఇచ్చిన లారెన్స్‌

- Advertisement -

టాలీవుడ్ వివాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి త‌మిళ న‌టుడు,డ్యాన్స్ మాస్ట‌ర్ లారెన్స్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.గ‌తంలో శ్రీరెడ్డి లారెన్స్‌పై కూడా లైంగిక ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.లారెన్స్ త‌న ప్రైవేట్ భాగాలను తాకాడని శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ లో వివాదాస్పదంగా మారాయి.ఆ సమయంలో లారెన్స్ స్పందించి తనకు ఆమెతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చినా.. శ్రీరెడ్డి మాత్రం లారెన్స్ ని బూతులు తిట్టడం మానలేదు. అయితే తాజాగా త‌నుకు లారెన్స్ సినిమాలో అవ‌కాశం వ‌చ్చింద‌ని చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చింది శ్రీరెడ్డి. ”నా స్నేహితులందరికీ శుభవార్త. నేను లారెన్స్ ను ఆయన ఇంట్లో కలుసుకున్నాను.

ఆయన నాకు మంచి గౌరవాన్ని ఇచ్చారు. అక్కడ చాలా మంది పిల్లలున్నారు. వారంతా లారెన్స్ తో సంతోషంగా ఉన్నారు. నాకోసం ప్రార్థించారు కూడా. లారెన్స్ నాకు ఇంట్లోనే ఆడిషన్స్ నిర్వహించారు. తన తదుపరి చిత్రంలో తీసుకుంటున్నానని హామీ ఇచ్చిన లారెన్స్, మంచి పాత్రను ఆఫర్ చేస్తానన్నాడు.అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఈ డబ్బును నేను తిత్లీతో తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం ప్రజలకు విరాళంగా ఇస్తున్నాను” అని వెల్లడించింది. కొంత‌కాలం క్రితం లారెన్స్‌ని బండ బూతులు తిట్టిన శ్రీరెడ్డి ఇప్ప‌డు ఇలా మాట్లాడ‌టం వెనుక ఏం జ‌రిగి ఉంటుందో అని అనుమానిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -