Thursday, May 9, 2024
- Advertisement -

సుకుమార్ బ్రిలియన్స్…….. రామ్ చరణ్‌లో నటుడు బయటకొచ్చాడు…. రంగస్థలం ఫస్ట్ లుక్ సూపర్బ్

- Advertisement -

యువ హీరో నానీ సినిమాలు వరుసగా ఎందుకు హిట్స్ అవుతున్నాయి. దాదాపుగా గత కొంత కాలంగా వస్తున్న నానీ సినిమాలన్నీ కూడా ఒకే రకం కథలతో వస్తూ బోర్ కొట్టిస్తున్నాయి. కానీ నానీ సినిమాల కలెక్షన్స్ మాత్రం బాగుంటున్నాయి. ఎందుకని? నానీ మేజిక్ ఎక్కడుంది? ఆ విషయం చెప్పుకునే ముందు చిరంజీవి గురించి కూడా చెప్పుకోవాలి. ఎన్టీఆర్, కృష్ణ, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలు నటించిన తరహా సినిమాల్లోనే చిరంజీవి కూడా నటించాడు. చిరంజీవి నటించిన సినిమాల్లో గొప్ప కథా చిత్రాలు అనేవి పట్టుమని పది కూడా ఉండవు. మరి మెగాస్టార్ ఎందుకు నంబర్ ఒన్ అయ్యాడు. ఇప్పుడు నానీ సక్సెస్ వెనకాల, అప్పట్లో చిరుకి నంబర్ ఒన్ కిరీటం దక్కటం వెనకాల ఉన్న మేజిక్ ఒక్కటే. ప్రేక్షకులు ఓన్ చేసుకునేలాగా…..ఆ హారోలలో తమను తాము ఐడింటిఫై చేసుకునేలాగే వాళ్ళు చేసిన నటన. దశాబ్ధకాలంగా ఇండస్ట్రీలో ఉన్న రామ్ చరణ్‌లో అదే మిస్సయ్యింది. పవన్ కళ్యాణ్ కూడా తొలిప్రేమ, సుస్వాగతం లాంటి సినిమాలతో అప్పటి యువతరానికి ఆరాధ్యుడు అయ్యాడు. అయితే చరణ్‌కి మాత్రం ఆ ఛాన్స్ ఇప్పటి వరకూ రాలేదు. పదేళ్ళ నుంచీ పోరాటం చేస్తున్నప్పటికీ….మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్‌తో పాటు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చినప్పటికీ చరణ్‌ సొంత క్రేజ్ ఎంతంటే మాత్రం విశ్లేషకులు పెదవి విరుస్తూ ఉంటారు.

అయితే ఈ సారి మాత్రం చరణ్‌కి ఆ ఛాన్స్ వచ్చింది. తాజాగా రిలీజైన రంగస్థలం ఫస్ట్ లుక్‌తో ఎనభైల నాటి యువతరంతో పాటు, ఇప్పటి తరం కూడా చరణ్‌లో తమను తాము ఐడింటిఫై చేసుకోవడం ఖాయమనిపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో పది మంది రౌడీలు గాల్లోకి లేచిన బిల్డప్పులు లేవు, కాస్ట్లీ కార్‌లో కాస్ట్లీ సూట్‌తో ఫ్లైట్‌లో నుంచి దిగినవాళ్ళలా మేకప్ మాయలు లేవు. చాలా సింపుల్‌గా ఉంది. చాలా సింపుల్‌గా ఉంది. రామ్ చరణ్ అంతకంటే సింపుల్‌గా ఉన్నాడు. చాలా చాలా సహజంగా ఉన్నాడు. ఎంత సహజంగా అంటే మనకు రెగ్యులర్‌గా కళ్ళ ముందు కనిపించే మన సమాజంలో నుంచి పుట్టుకొచ్చిన ఒక సాదా సీదా యువకుడిలా ఉన్నాడు. గ్యాంగ్‌లీడర్‌లో చిరంజీవిలా, తొలిప్రేమలో పవన్ కళ్యాణ్‌లాగా. సినిమాను హిట్ చేయడానికి కమర్షియల్ అంశాలు ఉంటే చాలేమో కానీ ప్రేక్షకులు సొంతం చేసుకోవాలంటే మాత్రం ఈ మేజిక్‌నే కావాలి. చరణ్‌తో ఆ మేజిక్ క్రియేట్ చేయడం సుకుమార్ వందశాతం సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ లుక్ చూస్తూ ఉంటే మాత్రం ఈ సినిమా చరణ్‌కి మెమొరబుల్ మూవీ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాతో సుకుమార్ సారథ్యంలో తనలోని నటుడిని చరణ్ ఏ స్థాయిలో ఆవిష్కరించుకున్నాడో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -