Monday, May 6, 2024
- Advertisement -

ఆ ఇద్దరు హీరోలది జస్ట్ రూమర్ మాత్రమే

- Advertisement -

గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియలో ఒక్కటే రూమర్ .మహేష్ బాబు,బాలయ్యబాబు కాంబినేషన్లో ఓ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని. అది చాలా విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అని కొశ్చన్ చేస్తే..అటు హీరోల అభిమానులు ..ఇంకొందరు పనిపాటలేకుండా సోషల్ మీడియాను ఓ ఆటవస్తువుగా భావించేవారు చేస్తున్నారనుకోవచ్చు. కాని ఇక్కడ ఒక్కటి మాత్రం హైలెట్ అవుతుంది. అదేమిటంటే వీరిద్దరి కాంబోలో తెరకెక్కే చిత్రానికి బోయపాటి డైరెక్షన్ చేస్తున్నాడని.

ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు మహేష్ కృష్ణ అన్న చందంగా ఉంది ఇక్కడి యవ్వారం. బాలయ్యబాబు, మహేష్ బాబుల డేట్స్ ఏమాత్రం ఖాళీగా లేవు. ఎవరి వెంచర్లలో వారు ఫుల్ బిజీ అయిపోయారు. జైసింహతో బాలయ్య ఓ వైపు బిజీగా ఉంటూనే త్వరలో ఫాంటసీ ఫిలింను ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్లో తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇక మహేష్ బాబు ..భరత్ అను నేను తర్వాత కొత్త ప్రాజెక్టులు తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. అలాంటి టైమ్లో అన్నీ మానుకుని బాలయ్యతో మహేష్ ఏవిధంగా కలిసి సినిమా చేస్తాడు.ఇది కూడా ఇక్కడ జనాలు ఆలోచించుకోవల్సిన పరిస్థితి ఉంది. సో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నట్లు ఎక్కడా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనేది బోయపాటి డైరెక్షన్లో సెట్స్ మీదకు వెళ్తుందని ఎవ్వరూ ఊహించుకోవల్సిన అవసరం లేదు. ఇది ఒట్టి ట్రాష్ .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -