Sunday, May 5, 2024
- Advertisement -

‘రంగస్థలం’ షూటింగ్ పూర్తి..

- Advertisement -

ఆ పాత త‌రం నేప‌థ్యంలో గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతంలో ఓ ఊరి గురించి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ‘రంగస్థలం’ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ ఆదివారం (మార్చి 4)తో పూర్తి చేసుకుంది. ప్రేక్షకుల స్పందన కోసం ‘చిట్టిబాబు’ ఎదురుచూస్తున్నాడని న‌టుడు రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన ట్వీట్ట‌ర్‌లో ఓ ఫొటోతో ప్ర‌క‌టించారు. ‌

రామ్‌చ‌ర‌ణ్ ‘చిట్టిబాబు’గా సమంత ‘రామ‌ల‌క్ష్మి’గా న‌టిస్తున్నారు. ఈ సినిమా మొద‌టి నుంచి ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. వాటిక‌నుగుణంగా టీజ‌ర్లు, ఫ‌స్ట్ లుక్‌లు, పాట‌లు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సినిమాకు సంబంధించి చరణ్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్నారని ఉపాసన ట్వీట్‌తో తెలిసింది. ఈ సందర్భంగా ‘చిట్టిబాబు’ గెటప్‌లో ఉన్న చరణ్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకుంది. ‘‘చిట్టిబాబు’ షూటింగ్ పూర్త‌యి మార్చి 30వ తేదీన మీ స్పందన కోసం అతడు ఎదురుచూస్తున్నాడు’ అని ఆమె ట్వీట్‌లో ప్రేక్ష‌కులు, అభిమానుల‌కు విష‌యం చ‌రెప్పారు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌లో వ‌స్తున్న ఈ సినిమాలో అనసూయ, జగపతిబాబు, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. పూజా హెగ్డే ఐట‌మ్ పాట‌లో హాట్‌హాట్‌గా కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -