Tuesday, May 7, 2024
- Advertisement -

ఆక‌లిగా ఉందా..? డ‌బ్బులులేవా..? అక్క‌డ ఏర్పాటు చేసిన రెస్టారెంట్‌లో ఫ్రీగా భోజ‌నం…!

- Advertisement -

ఆక‌లి అనేది సృష్టిలో ఒక‌టే. దానికి కుల‌మ‌తాలు ఉండ‌వు. అక‌లి మ‌నుషుల‌ను ఎలాంటి ప‌నైనా చేయ‌డానికి ఒడిగ‌ట్టుతుంది. అలాంటి ఆక‌లి ఒక అమాయ‌కున్ని బ‌లితీసుకుంది. కేర‌ళ‌లో జ‌రిగిన ఆదివాసి యువకుడు మధు హత్య ఘటన దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. కేవలం అకలి తీర్చుకోవ‌డంకోసం బియ్యం దొంగలించినందుకు ఒక గుంపు ఎగబడి ఆ యువకుడిని(27) దారుణంగా కొట్టిచంపింది. మతిస్థిమితం లేని ఆ ఆదివాసీ కొడుతూ… ఆ సమయంలో సెల్ఫీ, సెల్ఫీ వీడియోలు తీసుకుని త‌మ పైశాచిక‌త్వాన్ని చాటుకున్నారు.తీసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు.

ఈ ఘటన తర్వాత కేరళ ప్రభుత్వంలో కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది. ఆకలి చావుల రహిత రాష్ట్రంగా కేరళను తీర్చి దిద్దేందుకు నడుం బిగించింది ప్ర‌భుత్వం . దీనిలో భాగంగా అలప్పుఝా జిల్లాలో క్యాష్‌ కౌంటర్‌ లెస్‌ రెస్టారెంట్‌ను ప్రారంభించింది. జనకీయ భక్షణశాల పేరుతో స్నేహజలకమ్‌ అనే ఎన్జీవో సంస్థ ప్రజలకు ఉచితంగా భోజనం అందించేందుకు ముందుకు వచ్చింది. శ

శ‌నివారం ఈ రెస్టారెంట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్‌ ఐజాక్‌ ప్రారంభించారు. ‘మధులా మరెవరూ బలి కాకూడద‌ని అందుకే ప్రభుత్వ ప్రోత్సాహకంతో ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించాం’ స్నేహజలకమ్‌ కన్వీనర్‌ వెల్లడించారు. ఆకలితో ఉండి.. జేబులో డబ్బులు లేని వాళ్లు ఇక్కడికొచ్చి కడుపు నిండా తినోచ్చు. ఒకవేళ తమకు ఏదైనా ఇవ్వాలనిపిస్తే మాత్రం అక్కడే ఉండే డ్రాప్‌ బాక్స్‌లో వేయాలి. ఎవరూ బలవంతం చెయ్యరు.

ఈ రెస్టారెంట్‌ను సుమారు రూ.11లక్షల తో ఏర్పాటు చేసిన ఈ హోటల్‌ రోజుకు రోజుకు సుమారు 2వేల మందికి ఈ హోటల్‌ భోజనం సమకూరుస్తోంది. ఈ హోటల్‌ కోసం సీఎస్‌ఆర్‌ ఫండ్‌ ఆఫ్‌ కేరళ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌(కేఎస్‌ఎఫ్‌ఈ) ఆధ్వర్యంలో నిధుల సేకరణ చేపట్టగా… డొనేషన్ల రూపంలో ఇప్పటిదాకా రూ. 20 లక్షల సేకరించారు. త్వరలో ఇలాంటి రెస్టారెంట్‌లను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -