Saturday, May 18, 2024
- Advertisement -

భాగమతిపై రాంచ‌ర‌ణ్ కామెంట్స్‌

- Advertisement -

అనుష్క ప్ర‌ధాన పాత్రలో ఇటీవ‌లే రీలిజై సూప‌ర్ హిట్ దిశ‌గా సాగిపోతున్న భాగ‌మ‌తి పై మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్‌ స్పందించాడు. భాగమతి చిత్రం పై పొగడ్తల వర్షం కురిపించారు.గత రాత్రి భాగమతి చూశానని, అనుష్క అద్భుతంగా నటించిందంటూ ఆకాశానికెత్తాశారు. సాంకేతిక అంశాలు, చిత్ర నిర్మాణం సూపర్‌గా ఉందన్నారు.చాలా మంచి సినిమా తీసిన అందరికీ అభినందనలు అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. భయంతో రాత్రి తన సతీమణి ఉపాసన నిద్ర కూడా పోలేదని చలోక్తి విసిరాడు.

రామ్‌చరణ్‌ ఎప్పటికప్పుడు సినిమా అప్‌డేట్లు, కొత్త విషయాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ అందరినీ అలరిస్తారు. ఏదైనా సినిమా విడుదలౌతుందంటే ఆయా వ్యక్తులకు శుభాకాంక్షలు తెలపడం, ఫోన్‌ చేసి అభినందిస్తారు.గతంలో బాహుబలి సమయంలోను చిత్ర బృందానికి తన అభినందనలు తెలిపాడు. శ్రీమంతుడు సినిమా సమయంలోను చరణ్‌ మహేష్‌బాబును అభినందించిన సంగతి తెలిసిందే.

https://www.facebook.com/AlwaysRamCharan/photos/a.298908460257547.1073741830.177773979037663/967730133375373/?type=3

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -