Sunday, May 5, 2024
- Advertisement -

పోలీసుల ప్రశ్నలతో రామ్‌గోపాల్ వర్మ ఉక్కిరిబిక్కిరి

- Advertisement -
  • మ‌హిళ‌ల‌ను అలా చూపించొచ్చా..?
  • మీపై చ‌ర్య‌లు ఎందుకు తీసుకోరాదు?
  • పోలీసుల ప్రశ్నలతో రామ్‌గోపాల్ వర్మ ఉక్కిరిబిక్కిరి
  • సీసీఎస్ విచారణలో ఆర్జీవీకి ప్ర‌శ్న‌ల వ‌ర్షం

నిత్యం వివాదాస్ప‌దంగా ఉండే రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న 30 ఏళ్ల సినీ జీవిత చ‌రిత్ర‌లో తొలిసారి పోలీసుల‌కు ఎదుట‌కు వ‌చ్చారు. తాను తీసిన ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ)` యూట్యూబ్ వీడియో విష‌యంలో మ‌హిళా సంఘాల ఫిర్యాదుతో శ‌నివారం (ఫిబ్ర‌వ‌రి 17) హైద‌రాబాద్ నాంప‌ల్లిలోని సీసీఎస్ ఎదుట హాజ‌ర‌య్యారు.

జీఎస్టీ తీసిన స‌మ‌యంలో ఆర్జీవీ ప‌లుసార్లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆ వీడియోలో మ‌హిళ‌ల‌ను ఒక్క నూలు పోగు కూడా లేకుండా అంగాంగం వ‌ర్ణించి తీయ‌డంతో మ‌హిళా సంఘాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. ప‌లుచోట్ల వ‌ర్మ దిష్టిబొమ్మ‌లు ద‌హ‌నం చేశారు. వ‌ర్మ‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పలు పోలీస్‌స్టేష‌న్‌ల‌లో ఫిర్యాదు అందాయి. ఈ నేప‌థ్యంలో సామాజిక ఉద్య‌మకారిణి దేవి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ‌కు పిలిచారు. దీంతో వ‌ర్మ‌కు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. వ‌ర్మ‌ను ప్ర‌శ్న‌ల‌తో ఊపిరాడ‌కుండా చేశారు. ఈ నేప‌థ్యంలో మాకు అందిన స‌మాచారం మేర‌కు వ‌ర్మ‌కు వేసిన ప్ర‌శ్న‌లు ఇలా ఉన్నాయి.

– ఐటీ యాక్ట్ ప్రకారం మహిళలను అశ్లీలంగా చూపించడం తప్పు. దీనికి మీ సమాధానం ఏమిటి?
– ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్లలో పెట్టిన పోర్న్ స్టార్ మియా మాల్కోవా ఫొటోలు ఎక్కడివి?
– ఓ టీవీ ఛానల్ చర్చలో విశాఖపట్నంకు చెందిన మహిళ మీద మీరు చేసిన కామెంట్లు అభ్యంతరకరం కాదా?
– ఓ మ‌హిళా వేత్త‌తో పోర్న్ సినిమా తీస్తాననడం ఎంతవరకు కరెక్ట్?
– ఈ సినిమాకు భారతీయ చట్టాలు వర్తించవు అని మీరు అంటున్నారు…. దీనికి మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి?
– సినిమాను అమెరికాలో తీశాను, అక్కడ నుంచే ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేశామని చెబుతున్నారు. సినిమాను ఎలా తీశారు? పెట్టుబడి ఎవరు పెట్టారు?
– విమియో వెబ్ సైట్ కు ఈ సినిమాను ఎంతకు అమ్మారు?
– సినిమాలో నటించిన మాల్కోవాకి డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చారు?

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -