Tuesday, May 14, 2024
- Advertisement -

ర‌వితేజ‌, శ్రీనువైట్ల సినిమాకు థ‌మ‌న్ మ్యూజిక్‌

- Advertisement -

టాలీవుడ్‌లో ఇప్పుడు క్రేజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎస్.ఎస్ థ‌మ‌న్ అయ్యాడు. గ‌తంలో మాదిరిగా ఊక దంపుడు మ్యూజిక్ కాకుండా ఇప్పుడు కొత్త త‌ర‌హా మ్యూజిక్ అందిస్తున్నాడు. అత‌డు మ్యూజిక్ అందించిన సినిమాలు బాగానే ఆడుతున్నాయి. మ్యూజిక్‌లో కొత్త‌ద‌నం చూపించ‌డంతో ప్ర‌స్తుతం అవ‌కాశాలు పోలొమ‌ని వ‌చ్చేస్తున్నాయి. ఇప్పుడు మ‌రో క్రేజీ సినిమాకు థ‌మ‌న్ ప‌ని చేసే అవ‌కాశం వ‌చ్చింది. ఇటీవ‌ల వ‌రుణ్‌తేజ్‌, రాశీఖ‌న్నాతో వెంకీ అట్లూరి తీసిన తొలిప్రేమ సినిమాకు థ‌మ‌న్ మంచి మెలోడి సాంగ్స్ అందించాడు.

దీంతో ఇప్పుడు ర‌వితేజ‌, శ్రీనువైట్ల సినిమాకు మ్యూజిక్ అందించే ఆఫ‌ర్‌ను ప‌ట్టుకున్నాడు. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో థ‌మ‌న్ సినిమాకు ప‌నిచేయ‌నున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నఈ సినిమా మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది. అయితే ఈ సినిమాకు `అమర్ అక్బర్ ఆంటోని` అనే టైటిల్‌ను ఫిక్స్ చేశార‌ని టాక్‌.

ఈ సినిమాకు కథానుగుణంగా ఈ సినిమా షూట్ మొత్తం అమెరికాలో కొన‌సాగ‌నుంది. రవితేజ ఇందులో మూడు విభిన్నమైన పాత్రల్లో క‌నిపించనున్నాడు. శ్రీనువైట్ల, రవి తేజ కాంబినేషన్ అంటే పర్ఫెక్ట్ మాస్ నంబర్ కాబట్టి, థమన్ కూడా మాస్ ట్యూన్స్ ఇవ్వ‌డంలో నేర్ప‌రే. ప్ర‌స్తుతం ర‌వితేజ న‌టిస్తున్న నేల టికెట్ సినిమా షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాలో న‌టించే అవ‌కాశం ఉంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -