Saturday, May 4, 2024
- Advertisement -

రెండు రేర్ రికార్డులు మిస్ చేసుకున్న కుల్దీప్ యాద‌వ్‌…

- Advertisement -

విదేశాల్లో తడబడే భారత బ్యాట్స్‌మెన్‌.. దక్షిణాఫ్రికాలాంటి క్లిష్టమైన వేదికల్లో చారిత్రక సిరీస్‌ను సొంతం చేసుకుని తమ సత్తా ఏమిటో చాటిచెప్పారు. ప్రధానంగా భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చెలరేగిపోయి మూడు శతకాలు సాధించడంతో మనోళ్లు 5-1 తేడాతో సఫారీలను మట్టికరిపించి ఆ గడ్డపై తొలిసారి సిరీస్‌ను సాధించారు.

తొలి వన్డే సిరీస్‌ గెలవడంలో మణికట్టు స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషించారు. స్పిన్ ద్వయం కుల్దీప్, చాహల్ 33 వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను న‌డ్డి విరిచారు.నాలుగో వన్డే మినహా మిగతా అన్ని మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థిని తమ స్పిన్ ఉచ్చులో బిగించడంలో వీరు సఫలమయ్యారు. కుల్దీప్ 17 వికెట్లు తీయగా.. చాహల్ 16 వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లెవరూ వీరి దరిదాపుల్లో లేరు. దీన్ని బట్టే టీమిండియా విజయాల్లో వీరెంత కీలక పాత్ర పోషించారో అర్థం అవుతుంది.

దక్షిణాఫ్రికా గడ్డ మీద వన్డే సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా కుల్దీప్ నిలిచాడు. 1998లో మురళీధరన్ ముత్తయ్య పేరిట ఉన్న 14 వికెట్ల రికార్డ్‌ను కుల్దీప్‌తోపాటు చాహల్ కూడా అధిగమించాడు. అద్భుతంగా బౌలింగ్ చేసిన వీరిద్దరిపై సచిన్, సెహ్వాగ్, లక్ష్మణ్ లాంటి దిగ్గజ క్రికెటర్లను వీరిని ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు.

కుల్దీప్ యాద‌వ్ మ‌రో వికెట్ తీసి ఉంటే అరుదైన రికార్డునే అందుకునే వాడే. ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా అమిత్ మిశ్రా పేరిట ఉన్న రికార్డును సమం చేసేవాడే. కానీ చివరి వన్డేలో రెండు వికెట్లు మాత్రమే తీసిన కుల్దీప్ ఆ రికార్డుకు ఒక్క వికెట్ దూరంలో నిలిచాడు. మిశ్రా జింబాబ్వేపై 5 వన్డేల్లో 18 వికెట్లు తీయడమే ఇప్పటి వరకూ రికార్డ్.

మరో వికెట్ తీసి ఉంటే విదేశాల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో జవగళ్ శ్రీనాథ్, మిశ్రాల సరసన కుల్దీప్ నిలిచేవాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -