Friday, May 17, 2024
- Advertisement -

సర్దార్ గబ్బర్ సింగ్ హిందీలో మటాష్

- Advertisement -

పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాపై  దర్శకుడు రాం గోపాల్ వర్మ సంచలనాల ట్విట్ చేశాడు. ఉగాది సందర్భంగా తెలుగు, హిందీ భాషల్లో విడుదలై సర్దార్ గబ్బర్ సింగ్ హిందీలో ఓపెనింగ్ లేక చతికిల పడిందని వర్మ తన పోస్ట్ లో పేర్కొన్నారు.

నేను రెండు నెలల క్రితమే ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేయవద్దని చెప్పాను. కాని విడుదల చేశారు. సర్దార్ గబ్బర్ సింగ్ కు హిందీలో రెండు శాతమే ఓపెనింగ్స్ వచ్చాయని, ఇప్పటికైనా పవన్ కల్యాణ్ తన పక్కనున్న వారి చెడు సలహాలు వినకుండా కళ్లు తెరవాలని అన్నారు. ఈ సినిమా విడుదలతో హిందీలో పవన్ కల్యాణ్ కంటే ప్రభాస్ పెద్ద హీరోగా నిలబడతాడని వర్మ పోస్ట్ చేశారు. పవన్ కల్యాణ్ హిందీలోకి వెళ్లాలంటే బాహుబలికి మించిన సినిమాతో వెళ్లాలే కాని డబ్బింగ్ సినిమాతో కాదని హితవు పలికారు వర్మ. వినేవాడు ఉండాలే కాని వర్మకి అందరూ లోకువే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -