Tuesday, May 14, 2024
- Advertisement -

మే నెలలో అయితే చూద్దాం

- Advertisement -

విజయ్ మాల్యా. ఆదాయానికి మించి అప్పులు చేసేసి విదేశాలకు చెక్కేసిన ఘరానా మోసగాడు. అంతే కాదు పనామా పత్రాల కేసులో  కూడా ఇరుక్కున్న ఘనుడు. మనీ ల్యాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ముందు హాజరుకావాలని ఎన్ని నోటీసులు ఇచ్చినా కుదరడం లేదు..

రాలేను అంటూ సమాధానం చెబుతున్నారు. తాజాగా శనివారం నాడు కూడా అదే సమాధానం ఇచ్చారాయన. ఈ రోజు రాలేను. మే నెలాఖరులో అయితే నాకు కుదురుతుంది. అప్పుడు చూద్దాం అంటూ సమాధానమిచ్చారు. రుణ ఎగవేతకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసులున్నాయని, వాటి సెటిల్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని, అందుకే ఈడి ముందు హాజరుకావడానికి కొంత సమయం కావాలని మాల్యా కోరారు. మనీ ల్యాండరింగ్ కేసులో నిందితులు తప్పక ఈడి ముందు హాజరుకావాల్సి ఉందని ఈడి అధికారులు చెబుతున్నారు. మొండిగా వ్యవహరిస్తున్న మాల్యా కేసును ఈడి ఎలా డీల్ చేస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -