Wednesday, May 15, 2024
- Advertisement -

పవన్ ఫ్యాన్స్ కేవలం 11 వేలమందేనా?

- Advertisement -

ప‌వ‌ర్ స్టార్ , జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై మ‌రోసారి వివాస్ప‌ద వాఖ్య‌లు చేశాడు రాంగోపాల్ వ‌ర్మ‌.తెలుగు హీరోల‌లో అత్య‌ధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల‌లో ప‌వ‌న్ ఒక‌రు.జ‌న‌సేన పార్టీ పెట్టిన త‌రువాత త‌న‌కంటు ప్ర‌త్యేక కేడ‌ర్‌ను ఏర్పాటు చేసుకున్నారు.పార్టీ సభ్య‌త్వంపై పోక‌స్ పెట్టిన ప‌వ‌న్ వాటిని ఓట్లుగా మ‌లిచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.ఈ సంగ‌తిని ప‌క్క‌న పెడితే ప‌వ‌న్ ఫ్యాన్స్ 11 వేల మందే అని తేల్చేశారు వ‌ర్మ‌.అది ఏ లెక్క‌ల ప్ర‌కారం అని అనుకుంటున్నారా!రెండు రోజులు క్రితం నాగ్‌-వ‌ర్మ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఆఫీస‌ర్ సినిమా సెకండ్ టీజ‌ర్ రీలిజ్ చేశారు.

ఈ సినిమా టీజ‌ర్‌కు యూట్యుబ్‌లో లైక్స్ క‌న్నా డిస్‌లైక్స్ ఎక్కువుగా వచ్చాయి.ఈ డిస్‌లైక్స్ కొట్టింది ప‌వ‌న్ అభిమానులే అని వ‌ర్మ భావ‌న‌.అందుకే డిస్‌లైక్స్‌ని లెక్కించి వారిని ప‌వ‌న్ ఫ్యాన్స్‌గా లెక్కించాడు వ‌ర్మ‌.ఈ విష‌యాన్ని వ‌ర్మే స్వ‌యంగా త‌న ట్వీట్ట‌ర్ అకౌంట్‌లో తెలిపారు.ప‌వ‌న్ 11 వేల మంది ఫ్యాన్స్‌ని 11 కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నార‌నుకుని భ్ర‌మ ప‌డుతున్నార‌ని ఎద్దేవ చేశాడు.పవన్ ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే.. జనసేన కూడా ప్రజారాజ్యంలా డిజాస్టర్ కావడం తప్పదని హెచ్చరించాడు వర్మ.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -