Monday, May 6, 2024
- Advertisement -

ధోనీ టెస్టుల్లోకి మ‌ళ్లీ వ‌స్తే బాగుంటుంది…సునీల్ గ‌వాస్క‌ర్‌

- Advertisement -

భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ టెస్టులను వీడాల్సింది కాదని.. అతని సూచనలు, సలహాలు జట్టు సభ్యులకు ఎంతో విలువైనవని మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. దీనికి ప్ర‌ధాన కార‌నం సఫారీ గడ్డపై వికెట్‌ కీపర్ల వైఫల్యమే ఇందుకు ప్రధాన కారణం. సాహా గాయపడటంతో సెంచూరియన్‌లో జరుగుతోన్న రెండో టెస్టులో వికెట్‌ కీపర్‌గా పార్ధీవ్‌ పటేల్‌కు జట్టులో చోటు కల్పించాడు కోహ్లీ.

సఫారీ గడ్డ మీద టీమిండియాకు వరసగా ఎదురుదెబ్బలు తగులుతుండే సరికి.. భారత మాజీ క్రికెటర్లు కొత్త రకం విశ్లేషణలు వినిపిస్తున్నారు. ఒక విధంగా మాజీలే టీమిండియా మోరల్ స్ట్రెంగ్త్ మీద దెబ్బకొడుతున్నారు. దక్షిణాఫ్రికాలో టీమిండియా కోలుకునే అవకాశం లేదని.. వరస ఓటములు తప్పవన్నట్టుగా రెండో టెస్టుకు ముందే వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించగా.. ఇప్పుడు మరో మాజీ కెప్టెన్, లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… ధోనీ జట్టులో ఉండుంటే బావుండని అంటున్నారు.

టెస్ట్ క్రికెట్ నుంచి ఇప్పటికే తప్పుకుని.. ఇక వన్డేల నుంచి కూడా ధోనీ తప్పుకుంటాడేమో.. అనే విశ్లేషణలు మొన్నటి వరకూ వినిపించగా, గవాస్కర్ మాత్రం.. ధోనీ తిరిగి టెస్టు జట్టులోకి రావాలని అంటున్నాడు. ధోనీ టెస్టుల్లో ఆడటానికి సిద్ధంగా ఉంటే.. అతడు తక్షణం మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వొచ్చు. కెప్టెన్ గా బాధ్యతలు వదులుకున్న ధోనీ.. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ గా కొనసాగితే బావుంటుంది. ఆటు మైదానంలో, డ్రస్సింగ్ రూమ్ లో ధోనీ సలహాలు, సూచనలు ఆటగాళ్లకు కీలకం కాగలవు..’ అని అంటున్నాడు గవాస్కర్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -