Thursday, April 25, 2024
- Advertisement -

అనుపమ నడుమందాలు సినిమాను కాపాడతాయా?

- Advertisement -

యంగ్ హీరో రామ్ కెరీర్ ఒక హిట్‌, రెండు ప్లాప్‌లుగా సాగుతుంది. మంచి కథలను ఎంచుకున్నప్పటికీ ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగేసరికి డిజాస్టర్స్ ఎక్కువగా అందుకోవడం కామన్ అయ్యింది. నేను శైలజా సినిమాతో ఐదేళ్ల పరాజయాల నుంచి బయటపడ్డ రామ్ ఆ తరువాత ఏడాది మరోసారి తడబడ్డాడు. హైపర్ సినిమా ప్లాప్‌గా అవ్వ‌గా, ఉన్నది ఒకటే జిందగీ అనే సినిమా యావ‌రేజ్‌గా నిలిచింది. ప్ర‌స్తుతం రామ్ న‌టిస్తున్న సినిమా హ‌లో గురు ప్రేమ కోస‌మే. త్రినాధ్ రావ్ నక్కిన దర్శకత్వంలోకి వస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి.

పైగా దిల్ రాజు సినిమాని నిర్మిస్తుండడంతో సినిమా బాగానే బిజినెస్ చేసిందని స‌మాచారం. ఇప్పటికే టీజర్‌తో అనుపమ నడుమందాలు కుర్రకారును తెగ ఆకర్షించాయి. అక్టోబర్ 18న సినిమాను విడుదల చెయ్యాలని దిల్ రాజు ఒక నిర్ణయానికి వచ్చారు. ద‌స‌రాకి హ‌లో గురు ప్రేమ కోస‌మే ఒక్క సినిమానే విడుద‌ల అవుతుంది.ఎన్టీఆర్ న‌టించిన అరవింద సమేత ఓ వారం ముందుగానే వస్తుంది. దీంతో రామ్ సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా హిట్ అందుకుంటాడని చెప్పవచ్చు. మ‌రి రామ్ ల‌క్ ఎలా ఉందో చూడాలి అంటే పండ‌గ వ‌ర‌కు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -