Wednesday, April 24, 2024
- Advertisement -

డామిట్ కథ అడ్డం తిరిగింది ముహూర్తం బెడిసికొట్టింది

- Advertisement -

అసలే కేసీఆర్ కు ముహూర్తాలంటే నమ్మకం చాలా చాలా ఎక్కువ. ఎన్నిరకాల జ్యోతిష్యాలు ఉన్నాయో అన్నింటినీ నమ్ముతారు. సంఖ్యాశాస్త్రం, హస్తసాముద్రికం, తేదీలు, గ్రహాలు, రాశులు, నక్షత్రాలు, తిథి, వారం, వర్జ్యం, ఇలా అనేక లెక్కలు ఆయనకుంటాయి. అవన్నీ చూసుకునే తెలంగాణ అసెంబ్లీని రద్దు చేశారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడంతో ఆయనకు బ్యాడ్ టైం స్టార్టయినట్టేనని కాంగ్రెస్ పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వాళ్లు చెబుతున్న లెక్కలు, అంచనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ కేసీఆర్ కు ఏమాత్రం కలిసిరాదని, ఎన్నికల తేదీ, ఫలితాలు వెలువడే తేదీలు రెండూ కూడా ఆయనకు అనుకూలంగా లేవని కాంగ్రెస్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ ఏఐసీసీ కార్యదర్శి మదుయాష్కీ బాంబ్ పేల్చారు. నవంబర్ లో ఎన్నికలు జరిగితేనే టీఆర్ఎస్ గెలుస్తుందని ఓ జ్యోతిష్యుడు కేసీఆర్ తో చెప్పాడన్నారు. అందుకే మోడీతో, ఒత్తిడి తెప్పించి, ఎన్నికల సంఘం ద్వారా ఎలాగైనా నవంబర్ లో ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన్ ఇప్పించుకోవాలని కేసీఆర్ చూశారన్నారు. కానీ 4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ తో పాటు తెలంగాణ షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ దెబ్బతో కేసీఆర్ 2 పెగ్గులు ఎక్కువే తాగి పడుకుని ఉంటాడని, కానీ ఆయనకు నిద్రపట్టదని మధుయాష్కీ ఎద్దేవా చేశారు.

డిసెంబర్ 7న తెలంగాణలో పోలింగ్ జరగనుంది. ఆ రోజు అమావాస్య, ఫలితాలు వెలువడేది డిసెంబర్ 11 వ తేదీన. ఆ రోజు మంగళవారం. ఎన్నికలు జరిగే నెలతో పాటు 7 అంకె, అమావాస్య రోజు కేసీఆర్ కు కలిసిరావని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక ఫలితాలు వెలువడే డిసెంబర్ 11న మంగళవారం, కేసీఅర్ కు అమంగళం అని కూడా ప్రచారం కొనసాగుతోంది. ఐదేళ్ల పాలన పూర్తి చేసుకోకుండానే కేసీఆర్ తొందర పడ్డారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు కూడా ముందస్తు ఎన్నికలు అధికార పార్టీకి సానుకూల ఫలితాలు ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇంకా 8 నెలల 26 రోజులు పరిపాలనకు అవకాశమున్నా కేసీఆర్ ముందస్తుకు వెళ్లి తన పుట్టి తానే ముంచుకున్నారని మధుయాష్కి కామెంట్ చేశారు.

కేసీఆర్ లక్కీ నంబర్ 6. అందుకే సెప్టెంబర్ 6వ తేదీన అత్యంత బలమైన గురుపుష్య యోగం, అమృతసిద్ధి యోగం, ఆయన అదృష్ట సంఖ్య 6, కలిసి వచ్చేలా మంచి ముహూర్తం చూసుకునే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారని జోరుగా ప్రచారం జరిగింది. దీనికి తోడు కేసీఆర్ లక్కీ నంబర్ 6వ అంకె వచ్చేలా సంఖ్యాశాస్త్రం ప్రకారం టీఆర్ఎస్ 105 మంది (1+0+5= 6) అభ్యర్ధులను తొలి విడత జాబితాలో కేసీఆర్ ప్రకటించారనే చర్చ కూడా జరిగింది. వీటితో నవంబర్ లో ఎన్నికలు జరిగితే మళ్లీ టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని జ్యోతిష్యుడు చెప్పడంతో ఆ విధంగా షెడ్యూల్ విడుదల కోసం కేసీఆర్ ఈసీతో కుమ్మకై తనకు అనుకూలంగా షెడ్యూల్ విడుదల చేయించుకోవాలని చూశారని మధు యాష్కీ ఆరోపించారు. కానీ కేసీఆర్ ఆశించినట్లు కాకుండా డిసెంబర్ లో ఎన్నికలు, ఫలితాలు ఉండటంతో ఇక కేసీఆర్ ఓటమి తథ్యమని మధుయాష్కి అన్నారు. డిసెంబర్ 7 అమావాస్య అశుభమని, డిసెంబర్ 11 మంగళవారం అమంగళమని, ఈ రెండు కేసీఆర్ కు వర్తిస్తాయన్నారు. మధుయాష్కీ కామెంట్లపై నెటిజన్లు రెండు విధాలా చర్చిస్తున్నారు. అవునని కొందరు ఏకీభవిస్తే, కాదని కొందరు కొట్టి పారేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -