Monday, May 13, 2024
- Advertisement -

మీడియా దాచేసింది సోషల్ మీడియా చాటేసింది

- Advertisement -

2019లో ఏపీలో ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు రాబోతున్నాయి ? అనే అంశంపై ఇటీవల సీ ఓటర్ సంస్థ జరిపిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. ‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరిట చేపట్టిన ఆ సర్వే ఫలితాలను ప్రముఖ ఇంగ్లిష్ న్యూస్ చానెల్ రిపబ్లిక్ టీవీ ప్రసారం చేసింది. దాని ప్రకారం ఏపీలో వచ్చే ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా రాదని తేల్చి చెప్పింది. ప్రాంతీయ పార్టీలైన టీడీపీ 4 స్థానాలను, వైఎస్ఆర్ సీపీ 21 ఎంపీ స్థానాలను గెల్చుకుంటాయని అంచనా వేసింది. గత సెప్టెంబర్ లో జరిపిన ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ విధంగా ఫలితాలు వస్తాయని రిపబ్లిక్ టీవీ చెప్పింది. వైఎస్సార్‌సీపీకి 41.9 శాతం ఓట్లు, టీడీపీకి 31.4 శాతం ఓట్లు పడతాయంది. 2014తో పోలిస్తే టీడీపీకి 9 శాతానికిపైగా ఓట్లు తగ్గుతాయని సర్వే అంచనా వేసింది.

అయితే సీ ఓటర్ సంస్థ ‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరిట చేపట్టిన సర్వే ఫలితాలు ఇవీ… అంటూ రిపబ్లిక్ టీవీ ప్రసారం చేసిన ఆ కథనానికి ఎంత విశ్వసనీయత ఉందనే విషయాన్ని పక్కన పెడితే, ఆ వార్తకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మీడియా కనీస ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆ సర్వే నిజమా ? అబద్ధమా ? అన్నది తర్వాత సంగతి. తమ రాష్ట్రానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన అంశంపై జాతీయ మీడియాలో అంత ఇంపార్టెంట్ కథనం వస్తే పచ్చ మీడియా పూర్తిగా దాన్ని గాలికొదిలేసింది. వైఎస్ఆర్ సీపీకి అనుకూలంగా ఆ సర్వే ఫలితాలు ఉండటమే అందుకు ప్రధాన కారణం. ఆ సర్వే విశ్వసనీయతను పక్కన పెడితే, అలాంటి సర్వే ఒకటి వచ్చిందనే వార్తను ఇవ్వడంలో సాక్షి తప్ప మిగిలిన ప్రధాన మీడియా సంస్థలు పూర్తిగా చేతులెత్తేశాయి. అయితే వీరి ఉద్దేశం ఆ వార్తను, ఆ సర్వేను గుర్తించలేక కాదు. కేవలం టీడీపీకి వ్యతిరేకంగా, వైఎస్ఆర్ సీపీకి అనుకూలంగా ఉన్నందునే రిపబ్లిక్ టీవీ సర్వేకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ వార్తను దాచేసే ప్రయత్నం చేశాయి. కానీ సోషల్ మీడియా, వివిధ వెబ్ సైట్లు, యూ ట్యూబ్ చానెల్స్ ఆ సర్వేను ప్రధానంగా ప్రచురించాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా దాచేసిన సర్వే వార్తలను సోషల్ మీడియా చాటేసింది. దీంతో కోటిమందికి పైగా రిపబ్లిక్ టీవీ పలితాలు చేరువయ్యాయి. దీంతో ఇక్కడ ఒక విషం స్పష్టమైంది. ప్రధాన మీడియా ఓ వార్తను దాచేయాలనుకుంటే దాచేయలేవు. రోజులు పూర్తిగా మారిపోయాయి. సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయిపోయింది. ప్రజల విశ్వసనీయత మెయిన్ స్ట్రీమ్ మీడియా కోల్పోతోంది. సోషల్ మీడియా వార్తలకు ప్రాధాన్యం పెరుగుతోంది. అందుకే సోషల్ మీడియాకు భవిష్యత్ లో మరింత ఆదరణ ఖాయమని స్పష్టమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -