Tuesday, May 21, 2024
- Advertisement -

హీరో రామ్ హ‌లో గురు ప్రేమ కోస‌మే ట్రైల‌ర్‌ రివ్యూ

- Advertisement -

ఎనర్జిటిక్ రామ్,అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న తాజా చిత్రం హలో గురు ప్రేమ కోస‌మే.సినిమా చూపిస్తా ఫేం త్రినధరావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఇప్ప‌టికే విడుద‌ల అయిన సాంగ్స్‌కు ,టీజ‌ర్‌కు మంచి రెస్ప‌న్స్ వ‌చ్చింది.తాజాగా ఈ రోజు హ‌లో గురు ప్రేమ కోస‌మే సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.రామ్ తనకంటే వయసులో పెద్దవాడైన ప్రకాష్ రాజ్ తో స్నేహం చేస్తుంటాడు.అమ్మాయిని ప్రేమించే క్యారెక్ట‌ర్‌లో రామ్‌…రామ్‌కు హెల్ప్ చేసే ఫ్రెండ్‌గా ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు.

ట్రైలర్‌లో డైలాగులు అద్భుతంగా పేలాయి.వాటిలో కొన్ని…”అమ్మాయిలు అబద్దాలు చెబితే కొడతారో లేదో కానీ అబద్దాలు చెబితే మాత్రం అమ్మాయిలు కచ్చితంగా పడతారు..”’గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకోవాలి అని చదివే చదువు మాత్రం మర్చిపోతాం.. కానీ మర్చిపోవాలి, మర్చిపోవాలి అనుకున్న అమ్మాయిని మాత్రం చచ్చేదాకా మర్చిపోలేం..”. ట్రైలర్ చివరలో డేటా బేస్ ఏంటని హీరోని ప్రశ్నించగా.. తను చెప్పే సమాధానం నవ్వులు పూయించింది. ట్రైల‌ర్‌ను చూస్తుంటే సినిమాను మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా తెర‌కెక్కించిన‌ట్లుగా క‌నిపిస్తుంది.ఈ సినిమా హీరో రామ్‌కు ఖ‌చ్చితంగా హిట్ ఇచ్చేలాగే ఉంది. సినిమాను ద‌స‌రాకు కానుక‌గా ఈ నెల 18న విడుద‌ల చేయ‌నున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -