Monday, May 6, 2024
- Advertisement -

ఆత్రాల పెళ్లికొడుకు కోదండరామ్

- Advertisement -

తెలంగాణలోని మహాకూటమి పొత్తులు-సీట్ల పంపకాలపై 48 గంటల్లో తేల్చాలంటూ తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ రెడ్డి పెట్టిన డెడ్ లైన్ పై సెటైర్లు పేలుతున్నాయి. కోదండరామ్ తీరు ఆత్రాల పెళ్లికొడుకులా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అతడు సినిమాలోని తనికెళ్ల భరణి చెప్పిన డైలాగ్ ని గుర్తు చేస్తున్నారు. జింకను వేటాడాలంటేనే పులి చాలా ఓపిగ్గా ఉంటుంది. అలాంటిది పులినే ఏటాడాలంటే ఇంకెంత ఓపిగ్గా ఉండాలా ? ఆ డైలాగ్ ని పొలిటికల్ యాంగిల్ లో చెబుతున్నారు కొందరు. పులి లాంటి కేసీఆర్ నే వేటాడాలంటే ఎంత ఓపిగ్గా ఉండాలో నీకు తెలవదు కోదండరామ్.. అంటూ జోకులు పేల్చుతున్నారు. పొత్తులు, సీట్ల పంపకాలు, కేసీఆర్ ఎత్తుగడలు, అభ్యర్ధుల బలాబలాలు, అభ్యర్ధుల మార్పులు చేర్పులు సవాలక్ష ఉంటాయి. వాటన్నింటిపై పూర్తి స్టడీ చేసి, అస్తశస్త్రాలను పూర్తిగా సన్నద్ధం చేసి బరిలో దిగాలి. అంతే కానీ నీ పార్టీ పురుడు పోసుకుందని, కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు నువ్వు పార్టీ పెట్టావని పోటీకి తొందర పడితే ఎలా ? అని ప్రశ్నిస్తున్నారు. పొత్తులు, సీట్ల పంపకాలపై 130 ఏళ్ల కాంగ్రెస్, 35 ఏళ్ల టీడీపీ, దశాబ్దాల సీపీఐకి తెలియదా ?

రాష్ట్రస్థాయిలో లీడర్లు క్షేత్రస్థాయిలో కేడర్లు ఉన్న ఆ పార్టీలకే తొందర లేదు. ఆచితూచి అడుగులేస్తున్నాయి. ప్రత్యర్ధి కేసీఆర్ బలమైన వాడు కనుక, మాటల మాంత్రికుడు కనుక జాగ్రత్తగా డీల్ చేయాలని ఆలోచిస్తున్నాయి. కానీ పట్టుమని పది మంది లీడర్లు లేరు. గ్రౌండ్ లెవల్లో కేడర్ లేదు. నువ్వు పోటీ చేసినా గెలుస్తావో లేదో ? తెలియదు. అలాంటి నీకు తొందరెందుకయ్యా కోదండం అంటూ నెటిజన్లు తీసి పారేస్తున్నారు. అసలు కేసీఆర్ ను గద్దె దించడమే నీ లక్ష్యమని మొన్నటి వరకూ చెప్పి, ఇప్పుడు సీట్లు పొత్తులు అంటూ అంత తొందరెందుకు పడుతున్నావ్ ? అంటూ నిలదీస్తున్నారు కూడా. నీ లక్ష్యం కేసీఆర్ ఓటమే అయితే అనుభవజ్ఞులైన నేతల మహాకూటమిలో ఒపిగ్గా ఉండు. వాళ్ల మార్గదర్శనంలో అడుగులెయ్. అంతేకానీ డెడైలైన్లు పెట్టి ఏం సాధిస్తావ్ ? వాళ్ల మీద ఒత్తడి పెంచి, ఓ పాతిక సీట్లు ఇవ్వకపోతే వేరే దారి చూసుకుంటానని బెదిరించి ఏం సాధిస్తావ్ ? అని ప్రశ్నిస్తున్నారు. నీ తీరు చూడబోతే కేసీఆర్ ని గద్దె దించడం కోసం పోరాడుతున్నట్టు లేదు. బీజేపీతో జట్టుకట్టి, ఎలాగైనా అధికారం కోసం తహతహలాడుతున్నట్టుంది. అని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అంగబలం అర్ధబలం లేని కోదండరామ్ మహాకూటమికి డెడ్ లైన్ పెట్టి పొత్తులు-సీట్లుపై తేల్చాల్సిందేనంటున్నాడంటే…లోపాయికారిగా అతడికి కేసీఆర్, లేదా అతడి మిత్రపక్షం బీజేపీ ఏవో బలమైన, అత్యంత ఆకర్షణీయమైన బిస్కట్లే వేసి ఉంటాయని అనుమానిస్తున్నారు. లేదంటే మొట్టమొదటి సారి ఎన్నికలకు రెడీ అవుతున్న కోదండరామ్, తన బలాన్ని తానే ఎక్కువగా ఊహించుకుని, ఇలా ఎగెరెగిరిపడుతున్నాడంటే అతడి అసలు లక్ష్యం ఏంటో ఆలోచించాల్సిందేనని తెలంగాణ ఓటర్లు ఆలోచనలో పడుతున్నారు. కాంగ్రెస్, మహాకూటమి వద్ద ముష్టి 3 సీట్ల కోసం కోదండరామ్ సాగిలపడి దండాలు పెడుతున్నాడు. నా వెనుక తెలంగాణ సమాజముంది అని చెప్పుకున్న అతడి స్థాయి ఇదీ…అని కావాలనే కేటీఆర్, హరీశ్ ఓ వైపు రెచ్చగొడుతున్నారు. దీంతో వారి ట్రాపులో పడిన కోదండరామ్ 25 లేదా 30 సీట్లలో పోటీ చేసి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి, పరోక్షంగా కేసీఅర్ నెత్తిన పాలు పోయటానికా ? నీ ఆత్రం అని అనుమానిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -