Wednesday, May 8, 2024
- Advertisement -

మామయ్య ని పక్కన పెడుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’

- Advertisement -

యువ కథానాయకుడు రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా తో పెద్ద విజయం సాధించిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా విజయం అంత ఈజీ గా రాలేదు. వరుస పరాజయాల తర్వాత ఏం సినిమా చేయాలి అని చూస్తున్న తరుణం లో రామ్ కి మామ అయిన స్రవంతి రవికిశోర్ చాలా కథలు వినిపించాడట కానీ రామ్ కి ఏది నచ్చలేదట. అందుకే టైం తీసుకొని, తనే పూరి స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాడట. సినిమా మీద పూర్తి నమ్మకం తో తన మామ ఇచ్చిన సలహాలని ఈ సినిమా కోసం వాడుకోలేదట. ఈ సినిమా కి సంబంధించి మొత్తం అన్ని నిర్ణయాలు పూరి కి వదిలేసాడట.

ఇక ఈ సినిమా విజయం సాధించడం తో రామ్ తన మామ సెలెక్షన్ కాకుండా తన సొంతం గా స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడని ప్రచారం నడుస్తుంది. ప్రస్తుతం విహార యాత్ర లో బిజీ గా ఉన్న రామ్ త్వరలో నే ఇంకొక మాస్ చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా కి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -