Thursday, May 9, 2024
- Advertisement -

త‌న భ‌విష్య‌ త్తుపై సెలెక్టర్లకు క్లారిటీ ఇచ్చిన ధోని…..

- Advertisement -

త‌న రిటైర్మెంట్ ఊహాగానాల‌పై స్ప‌ష్ట‌మైన క్లారిటీ ఇచ్చారు మ‌హేంద్ర సింగ్ ధోని. విండీస్ టూర్‌కు జ‌ట్టును ఎంపిక చేసే ముందు త‌న‌ను ఎంప‌కి చేయ‌వ‌ద్ద‌ని ధోని ముందే చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే తాను ఇప్పుడే రిటైర్మెంట్ కావ‌డంలేద‌ని…పారాచూట్ రెజిమెంట్ లో పనిచేసేందుకు రెండు నెలల ఆటకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.వెస్టిండీస్ టూర్ కు ధోనీని టీమిండియా సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. అయితే, వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ధోనీతో చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడినట్టు స‌మాచారం.

వచ్చే ఏడాది టి20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో, సమర్థుడైన వికెట్ కీపర్ ను ఇప్పటినుంచే తయారుచేసుకునేందుకు వీలుగా ధోనీతో ఎమ్మెస్కే చర్చలు జరపగా తాను ఇప్పుడే రిటైర్మెంట్ అవ్వ‌ట్లేద‌ని తెలిపారు.భారత్‌ భవిష్యత్తు ప్రణాళికల్లో ఉండనని చెప్పాడు. యువ ఆటగాళ్లను సిద్దం చేసుకోమని, జట్టు ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగాలని కూడా స్పష్టం చేశాడు.ఇక తనను మేజర్ టోర్నమెంట్లకు పరిగణనలోకి తీసుకోనవసరంలేదని ధోనీనే పరోక్షంగా చెప్పడంతో కుర్రాళ్లను ఎంకరేజ్ చేయాలని భారత సెలెక్టర్లు నిర్ణయించుకున్నారు. ఈ కార‌ణంగానె మూడు ఫార్మెట్‌ల‌కు పంత్‌ను ఎంపిక చేసిన‌ట్లు చీఫ్ సెల‌క్ట‌ర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -