Tuesday, May 14, 2024
- Advertisement -

అనుప‌మ‌తో ఎనర్జిటిక్‌ స్టార్ సినిమా ప్రారంభం

- Advertisement -

‘ఉన్నది ఒక్కటే జిందగీ’ సినిమాతో విజ‌యం ద‌క్కించుకున్న ఎన‌ర్జిక్ స్టార్‌ రామ్‌ ఇప్పుడు త‌న మ‌రో సినిమాను ప్రారంభించేశాడు. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ గురువారం ప్రారంభ‌మైంది. పూజా కార్య‌క్ర‌మాలు చేశారు. అయితే ఈ సినిమాకు ‘హలో గురు ప్రేమకోసమే’ పేరును ఫిక్స్ చేసి పోస్ట‌ర్‌ను విడుదల చేశారు.

అక్కినేని నాగార్జున నటించిన ‘నిర్ణయం’ సినిమాలోని ‘హలో గురూ ప్రేమకోసమేరా ఈ జీవితం..’ పాట ఇప్పటికీ ఎవర్‌గ్రీనే. ఈ సూపర్‌ హిట్‌ పాటలోని తొలి మూడు పదాలను టైటిల్‌గా పెట్టడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. రామ్‌ నటిస్తున్న ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. రామ్ ప‌క్క‌న అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్ద‌రు క‌లిసి గ‌తంలో ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ సినిమా చేశారు. మ‌ళ్లీ వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. శ్రీవెంక‌టేశ్వ‌ర్ సినీ క్రియేష‌న్స్ (ఎస్వీసీ) బ్యాన‌ర్‌లో దిల్‌ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=EXGqnKAQOpc

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -