Friday, May 3, 2024
- Advertisement -

రామ్ కొత్త సినిమా ఆగిపోయిందా?

- Advertisement -

హీరో రామ్ వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.రామ్ ప్ర‌స్తుతం హలో గురూ ప్రేమ కోసమే సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా త‌రువాత ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ లో నటించేందుకు ఓకె చెప్పాడు రామ్‌. గరుడవేగ సినిమాతో సక్సెస్‌ సాధించిన ప‍్రవీణ్‌, రామ్‌ హీరోగా భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించాలన భావించాడు.

అయితే ప్రస్తుతం ఉన్న రామ్‌ మార్కెట్ దృష్ట్యా ఈ ప్రాజెక్ట్ వర్క్‌ అవుట్ కాదన్న ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. రామ్‌కు ఈ మ‌ధ్య స‌రైన హిట్లు లేవు.ఈ సమయంలో భారీ బడ్జెట్‌ తో సినిమా చేస్తే రిస్క్‌ అన్న ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్‌. సినిమా బ‌డ్జెట్ త‌గ్గించ‌డానికి ప్రవీణ్‌ సత్తారు ఒప్పుకోవ‌డం లేద‌ని అందుకే సినిమా ఆగిపోయింది అని స‌మాచారం.అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

https://www.youtube.com/watch?v=Xz9mrDd42dU&t=3s

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -