Sunday, May 5, 2024
- Advertisement -

బోయ‌పాటి, చెర్రీ బిజీబిజీ

- Advertisement -

ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న రంగ‌స్థ‌లం సినిమా పూర్తి చేసి ఇప్పుడు రామ్‌చరణ్ మ‌రో సినిమాకు డేట్స్ ఇచ్చాడు. బోయపాటి శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా పూజా కార్య‌క్ర‌మాలు ఎప్పుడో పూర్త‌య్యాయి. ఈ సినిమా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. కేవలం ఒక ఫొటో మాత్రం విడుదల చేసిన ఈ సినిమా ముచ్చ‌ట్లు ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

రామ్‌చరణ్, బోయపాటి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. కాకపోతే ఈ షెడ్యూల్‌లో చరణ్ ఉండడు. కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులతో ఈ షెడ్యూల్ కానిస్తారు. ఫిబ్రవరిలో ప్రారంభించే సెకండ్ షెడ్యూల్‌లో రామ్‌చ‌ర‌ణ్ వ‌స్తాడు. కంప్లీట్ మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తీయ‌నున్నారు. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ ప‌క్క‌న అను ఎమ్మాన్యుయేల్ లేదా కైరా అద్వానీని న‌టించే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -