Sunday, May 5, 2024
- Advertisement -

కృష్ణ ఫ్యామిలీ నుంచి టాలీవుడ్‌లోకి మ‌రో హీరో

- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మహేశ్ బాబు దూసుకొచ్చాడు. పరాజయాలకు అతీతంగా ఆయన క్రేజ్ .. మార్కెట్ పెరుగుతూ ఉంది. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు. మహేశ్ బాబు కంటే ముందుగానే ఆయన అన్నయ్య రమేశ్ బాబు తెలుగులో హీరోగా కొన్ని సినిమాలు చేశారు. అయితే ఆ సినిమాలు అంతగా సక్సెస్ ను సాధించకపోవడం వలన, ఆయన సినిమా రంగానికి దూరమయ్యారు. త‌ర్వాత మ‌హేష్ బాబు సినిమారంగంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు.

తాజాగా కృష్ణ‌ఫ్యామిలీ నుంచి సినిమారంగంలోకి మ‌రో హీరో రాబోతున్నాడు. ర‌మేష్ న తనయుడు ‘జయకృష్ణ’ హీరోగా తెలుగుతెరకు పరిచయం కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కుర్రాడు వైజాగ్ లో సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణ తీసుకుంటున్నాడని సమాచారం. వచ్చే ఏడాది జయకృష్ణతో సినిమా ఉండేలా కృష్ణ ఫ్యామిలీ రంగాన్ని సిద్ధం చేస్తోందట. తాతయ్యలా .. బాబాయ్ లా ఈ కుర్రాడు దూసుకుపోతాడేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -