Tuesday, May 7, 2024
- Advertisement -

శ్రీదేవి భైతిక‌కాయం దుబాయ్‌ నుంచి ఇండియాకు రావ‌డానికి ఒ మెకానిక్‌ స‌హాయం

- Advertisement -

అతిలోక సుంద‌రిగా అభిమానుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న శ్రీదేవి అంత్య‌క్రియ‌లు ముంబై విలేపార్లేలోని శ్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం ముగిశాయి. అంత‌కు ముందు శ్రీదేవి భైతిక‌కాయం దుబాయ్‌నుంచి ఇండియాకు రావ‌డానికి నాలుగు రోజులు ప‌ట్టింది. అస‌మ‌యంలో శ్రీదేవి భౌతికకాయం దుబాయ్‌ నుంచి స్వదేశానికి తిరిగిరావటంలో అక్కడ స్థిరపడిన ఓ భారతీయుడు చేసిన సాయం గురించి మాట్లాడుకోవటం అవసరం.

ఆయన పేరు అశ్రఫ్‌ షెర్రీ తమరసెరీ. 44 ఏళ్ల ఈయన కేరళ నుంచి వచ్చి దుబాయ్‌లో స్థిరపడ్డాడు. యూఏఈలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపటాన్ని కర్తవ్యంగా భావిస్తారు. ఈయన అసలు వృత్తి మెకానిక్‌. దుబాయ్‌కి 35 కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రాంతంలో ఈయనకు మెకానిక్‌ షెడ్‌ ఉంది. మృత దేహాలను స్వస్థలాలకు పంపేందుకు.. అక్కడి చట్టాలకు అనుగుణంగా అవసరమైన పద్ధతులన్నీ దగ్గరుండి పూర్తి చేస్తారు. అందుకే అత‌నంటే అక్క‌డి అధికారులకు, యూఏఈలో ఉండే విదేశీయులకు అశ్రఫ్‌ అంటే విపరీతమైన గౌరవం.

ఇప్ప‌టి వ‌ర‌కు 18 ఏళ్లుగా 38 దేశాలకు చెందిన 4,700 మృతదేహాలను వారివారి దేశాలకు పంపిచారు అశ్రఫ్‌. శ్రీదేవి భౌతికకాయాన్ని భారత్‌కు తరలించిన రోజే ఈయన.. మరో ఐదు పార్థివ దేహాలనూ వేర్వేరు దేశాలకు పంపించారు. ఆయన్ను స్థానికులంతా ‘ఫ్రెండ్‌ ఆఫ్‌ డెడ్‌’అని పిలుస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -