Friday, May 17, 2024
- Advertisement -

కూలిపోయే స్థితిలో గుజ‌రాత్ ప్ర‌భుత్వం.. హ‌స్తం చాస్తున్నహార్దిక్ ప‌టేల్‌

- Advertisement -

బోటాబోటీగా వ‌చ్చిన సీట్ల‌తో గ‌ద్దెనెక్కిన భార‌తీయ జ‌న‌తా పార్టీకి కొత్త భ‌యం ప‌ట్టుకుంది. గుజ‌రాత్‌లో ప్ర‌భుత్వం అయితే వ‌చ్చింది కానీ అసంతృప్తులు రేగ‌డంతో ప్ర‌భుత్వం నేడో రేపో కూలిపోయే స్థాయికి చేరుకుంది. పార్టీలో అసంతృప్తులు, అస‌మ్మ‌తి, గ్రూపు రాజ‌కీయాలు పెర‌గ‌డం.. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో స‌మ‌పాళ్లు పాటించ‌క‌పోవ‌డంతో త్వ‌ర‌లోనే గ‌ట్టి దెబ్బ త‌గిలే అవ‌కాశం ఉంది. దీనికి ప్ర‌భుత్వం బాధ్య‌త‌లు స్వీక‌రించి ప‌క్షం రోజులు కూడా గ‌డ‌వ‌క‌ముందే లుక‌లుక‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

ఉప ముఖ్య‌మంత్రి నితిన్ ప‌టేల్ అల‌క‌బూనారు. నితిన్ రాజీనామా చేస్తార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. ఒక‌వేళ ఆయ‌న రాజీనామా చేస్తే ప్ర‌భుత్వం ఇర‌కాటంలో ప‌డే అవ‌కాశం ఉంది. ఆయ‌న ప్ర‌ధాన నాయ‌కుడు కావ‌డంతో ఆయ‌న వెంట కొంత‌మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయే అవ‌కాశం ఉంది. ముందే 99 సీట్లు ఉండ‌డంతో కొంత‌మంది ఉండ‌డంతో 93కి ఎమ్మెల్యేల మ‌ద్దతు త‌గ్గిపోతే ప్ర‌భుత్వం కూలిపోయే ప‌రిస్థితి ఉంది. ఇదే భావించిన ప‌టేల్ హ‌క్కుల ఉద్య‌మ‌కారుడు హార్దిక్ ప‌టేల్ హ‌స్తం అందించాడు.

నితిన్ ప‌టేల్ బ‌య‌ట‌కు వ‌చ్చి త‌మ‌తో చేతులు క‌లిపితే అధికారం మ‌న‌దేన‌ని స‌ల‌హా ఇచ్చాడు. హార్దిక్ ప‌టేల్ స‌ల‌హాతో బీజేపీకి షాక్ త‌గిలింది. వెంట‌నే బీజేపీ అగ్ర నేత‌ల్లో ఏం చేయాలో స‌మాలోచ‌న‌లు చేశారు. ఎట్ట‌కేల‌కు మోదీ మిత్రుడు అమిత్ షా రంగంలోకి దిగి నితిన్ ప‌టేల్‌ను ఓదార్చారు. మాట్లాడి స‌ర్ది జెప్పి ప్ర‌స్తుతానికి నితిన్ ప‌టేల్ బాధ్య‌త‌లు స్వీక‌రించేలా చేశారు. కానీ అత‌డిలో అసంతృప్తి అలాగే ఉంది. ఒక ఒర‌లో రెండు క‌త్తులు ఉండలేవ‌న‌ట్టు ఎప్ప‌టికో అప్పుడు ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

కాంగ్రెస్ పార్టీ వ్యూహం ర‌చించి నితిన్ ప‌టేల్‌ను వ‌ల వేస్తే అధికారం హ‌స్త‌నిదే అవుతుంది. దీనికి ఉద్య‌మ‌కారులు కూడా వంత పాడే అవ‌కాశం ఉంది. దెబ్బ‌కు మోదీకి ఝ‌ల‌క్ ఇచ్చే అవ‌కాశం ఉంది. ఆ విధంగా కాంగ్రెస్‌, ప‌టేల్ ఉద్య‌మకారులు చేస్తారో చేయ‌రో తెలియ‌దు. ఆ విధంగా చేస్తే ఓ ప‌ది, ప‌దిహేను మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ఇస్తే సునాయాసంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేప‌ట్టే అవ‌కాశం ఉంది.

గుజ‌రాత్‌లో పార్టీల బ‌లబ‌లాలు
బీజేపీ 99
కాంగ్రెస్ 79
ఇత‌రులు 4

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -