Saturday, May 4, 2024
- Advertisement -

ఎన్ హెచ్ 8 పై 40 కిలోమీటర్ల జాం

- Advertisement -

ట్రాఫిక్ జాం. హైదరాబాద్ లో అనుకుంటున్నారా. కాదండి భారత వాణిజ్య రాజధాని ముంబాయ్, అహ్మదాబాద్ లను కలిపి ఎన్ హెచ్ 8 పై జరిగింది.అది కూడా కిలోమీటరో, రెండు కిలోమీటర్లో అనుకునేరు. కానే కాదు. ఏకంగా 40 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

దీంతో ఈ జాతీయ రహదారిపై ఏకంగా 20 వేల వాహనాలు నిలిచిపోయాయి. ఈ జాతీయ రహదారిపై ఉన్న వడోదరా, సూరత్ లను కలిపే ఓ వంతెనకు మరమ్మతు పనులు చేస్తున్నారు. ఈ వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందుకు రాకూడదనే ఈ పనులు చేస్తున్నారు. దీంతో వడోదర వైపు 15 కిలోమీటర్లు, సూరత్ వైపు 25 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్ధంబించిపోయింది. దీంతో కేవలం 20 నుంచి 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికే గంటల కొద్దీ సమయం పడుతోంది.

దీంతో కార్లు, మోటార్ సైకిళ్ల వంటి వాహనాలు వేరే మార్గంలో వెళ్తున్నాయి. ట్రాఫిక్ ను నియంత్రించేందుకు 150 మంది పోలీసులు ఇద్దరు అధికారుల పర్యవేక్షణలో పని చేస్తున్నారు. ముంబాయ్, అహ్మదాబాద్ జాతీయ రహదారి వస్తు రవాణాకు ఎంతో ముఖ్యమైనది. ఇక్కడ ఫార్మాస్యూటికల్, ఫెర్టిలైజర్స్, కెమికల్స్, పెట్రో కెమికల్స్ కు సంబంధించిన అనేక పరిశ్రమలున్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -