Wednesday, May 8, 2024
- Advertisement -

పెదబాబు,రానాబాబుల వ్యూహమేంటి..?

- Advertisement -

 టాలీవుడ్ హంక్ రానా… తన ఫ్యూచర్ పై మల్లగుల్లాలు పడుతున్నాడు. బళ్లాల దేవతో వచ్చిన ఇమేజ్ ను ఏ యాంగిల్ లో ఉపయోగించుకోవాలో అర్థం కాక సతమతమౌతున్నాడు.

 

ప్రస్తుతానికి బెంగుళూరు డేస్ నైతే ఎంజాయ్ చేస్తున్నాడు గాని… బళ్లాలదేవుడిగా వచ్చిన ఇమేజ్….. కరెక్ట్ గా ఏ తరహా చిత్రాలకు సెట్ అవుతుందో  అర్ధం కాక….తండ్రి సురేష్ బాబుతో కలిసి డిస్కషన్ల మీద డిస్కషన్లు

చేసేస్తున్నాడట.తండ్రిగారు బిటౌన్ పైన దృష్టి పెట్టమని చెబుతుంటే… అబ్బాయిగారు టాలీవుడ్లోనే కటింగ్ కొడతానంటున్నాడట.నిజానికి టాలీవుడ్ హంక్  గా పేరున్న రానా బిటౌన్ హంక్ గా రాణించడం పెద్ద కష్టమేమి కాదు.

 రానా ఫేస్ బిటౌన్ కు భలే సెట్ అవుతుంది.ఆల్రెడీ బేబీతో రావల్సిన ఇమేజ్ వచ్చింది కాబట్టి… రానా బాలీవుడ్లో సెటిలైతేనే బెటర్ .లేదూ ఇక్కడే ఏదో ఒకటి చేయాలని ఫీలైతే మాత్రం….. ఎప్పటిలాగానే కృష్ణం వందే జగద్గురుం ,

లీడర్ తరహా చిత్రాలు చేసుకుంటూ పడ్డ కష్టానికి తగ్గ ఫలితం రాకుండా కాలం గడపాల్సి వస్తోంది. టాలీవుడ్ లో  ఏ హీరోకు లేని ఫిజిక్ రానాకు సొంతం కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనైనా ఆలోచించి మనవాడు ముంబాయిలో 

జెండా ఎగరేయడమే ఉత్తమం.ఆల్రెడీ ఇదే విషయం సురేష్ బాబు గారు చెప్పినప్పటికీ… రానా వినడం లేదట.ఇంట గెలిచి రచ్చ గెలుస్తానంటున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -