Friday, May 3, 2024
- Advertisement -

అర్షదీప్ పాంచ్ పటాక..తొలి వన్డేలో గెలుపు

- Advertisement -

దక్షిణాఫ్రికాతో జరిగి తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. దక్షిణాఫ్రికా విధించిన 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి భారత్ 16.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. అంతర్జాతీయంగా తొలి వన్డే ఆడుతున్న సాయి సుదర్శన్‌ 43 బంతుల్లో 9 ఫోర్లతో 55 నాటౌట్‌గా నిలవగా శ్రేయస్‌ అయ్యర్‌ 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో 52 పరుగులు చేశారు.భారత్‌ మరో 200 బంతులు మిగిలుండగానే 8 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 27.3 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. ఫెలుక్వాయో (33, జోర్జీ (28), కెప్టెన్‌ మార్క్మ్‌ (12), షంసీ (11) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ 5, అవేశ్‌ నాలుగు వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా సూపర్ బౌలింగ్‌తో ఆకట్టుకున్న అర్షదీప్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మంగళవారం రెండో వన్డే జరగనుంది. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించేందుకు దక్షిణాఫ్రికా జట్టు ఈ మ్యాచ్‌లో గులాబీ జెర్సీలతో బరిలోకి దిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -