Monday, June 17, 2024
- Advertisement -

రాంచ‌ర‌ణ్‌ రంగస్థలం తొలి వీకెండ్ కలెక్షన్లు

- Advertisement -

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘రంగస్థలం’ సినిమా గ‌త శుక్ర‌వారం(30)న రీలిజ్ అయింది.సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు తిరిగరాస్తోంది. ‘రంగస్థలం’ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. రాంచ‌ర‌ణ్ కెరీర్‌లోనే సూప‌ర్ హిట్‌గా నిలిచే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టీ వ‌రుకు రాంచ‌ర‌ణ్ మ‌గ‌ధీర సినిమానే పెద్ద హిట్ సినిమా ఆ సినిమా త‌రువాత రాంచ‌ర‌ణ్‌కు స‌రైన హిట్ లేదు.చాలకాలం త‌రువాత చ‌ర‌ణ్‌కు సూప‌ర్ హిట్ సినిమా రావ‌డంతో అభిమాన‌లు త‌మ అభిమానాన్ని క‌లెక్ష‌న్ల రూపంలో చూపిస్తున్నారు.విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం తొలి వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా రూ.88 కోట్లు రాబట్టింది.

ఇందులో డిస్ట్రిబ్యూటర్ల షేర్ రూ.55 కోట్ల వరకు ఉంటుందని అంచనా. తొలి మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణల్లోనే ఈ చిత్రం రూ.37.40 కోట్లు రాబట్టింది. ఈ సినిమా ఈ విధాంగానే క‌లెక్ష‌న్స్‌ని సాధిస్తే శ్రీమంతుడు సినిమాను దాటే అవ‌కాశం ఉంది.ఇప్ప‌టి వ‌రుకు నాన్ బాహుబ‌లి రికార్డుల‌న్నీ శ్రీమంతుడు సినిమా పేరు మీదే ఉన్నాయి. శ్రీమంతుడు ఫుల్ ర‌న్ టైంలో 195 కోట్లు సాధించి నాన్ బాహుబ‌లిగా రికార్డు సాధించింది.దాని త‌రువాత మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఖైదీ150 సినిమా 162 కోట్ల‌తో మూడో స్థానంలో ఉంది. రాంచ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం ఊపు చూస్తుంటే నాన్ బాహుబ‌లి సినిమాగా రికార్డు సృష్టించే అశ‌కాశం ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -