Thursday, May 9, 2024
- Advertisement -

రంగస్థలంలో డిలీటెడ్ రొమాంటిక్ సాంగ్……… అదిరిపోయిందబ్బా…..

- Advertisement -

రంగస్థలం సినిమా చూసిన ప్రేక్షకులందరినీ కాస్త నిరాశకు గురిచేసే న్యూస్ ఇది. అంతా సుకుమార్ మహత్యమో…….లేక నిడివి పెరిగిపోతోందన్న మెగా కాంపౌండ్ కండిషన్స్ ఎఫెక్టో కానీ రంగస్థలం సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం ఓ సూపర్ ఎక్స్‌పీరియన్స్ మిస్ అయ్యారు. సమంతా, రామ్ చరణ్‌ల లవ్ ట్రాక్‌ని సినిమా చూసిన అందరూ ఇష్టపడ్డారు. వాళ్ళందరినీ మెప్పించే స్థాయిలో రంగస్థలంలో ఇంకో బ్యూటిఫుల్, రొమాంటిక్ లవ్ సాంగ్ కూడా ఉంది. దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సమంతా-చెర్రీలు కూడా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

ఓ పిల్లా నిన్ను చూడక మళ్ళా అనే ఈ బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్లీ సాంగ్ రిలీజ్ అయి ఉంటే……సినిమాలో ఉండి ఉంటే రంగస్థలం సినిమాకు మరో ఎస్సెట్ అయి ఉండేదనడంలో సందేహం లేదు. చిట్టిబాబు, రామలక్ష్మిల జంట మరికాసేపు ప్రేక్షకులకు కనువిందు చేసి ఉండేది. అయితే అప్పటికే రంగస్థలం సినిమా నిడివి దాదాపు మూడు గంటలకు వస్తోందని భయపడ్డ మెగా క్యాంప్ కొంత సినిమాను ఎడిట్ చేయమని సుకుమార్‌కి కండిషన్స్ పెట్టడంతో ఈ సాంగ్‌ని డిలీట్ చేశారు. ఇప్పుడు యూట్యూాబ్‌లో రిలీజ్ చేసిన ఈ సాంగ్‌ని వింటున్న వీక్షకులు మాత్రం ……….అరే……..మంచి సాంగ్ మిస్సయ్యామే……..సిట్టిబాబు, రామలక్ష్మిల లవ్లీ రొమాన్స్ మరికాసేపు చూసే ఛాన్స్ పోయిందే అని ఫీలవుతున్నారు. ఏది ఏమైనా డిలీటెడ్ సాంగ్ కూడా ఓ రేంజ్‌లో ఉండడం సుకుమార్ రంగస్థలం సినిమాకే సాధ్యమైందేమో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -