- Advertisement -

బాహుబలిని దాటిన రంగస్థలం

- Advertisement -

రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కిన రంగస్థలం రికార్డులు సృష్టిస్తు దూసుకుపోతుంది. రంగస్థలం భారీ వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా ఓవర్‌ సీస్‌లో 28 లక్షల డాలర్లకు పైగా వసూళు చేసిన ఈ సినిమా 30 లక్షల డాలర్ల మార్క్‌ను కూడా ఈజీగా సాధిస్తుందని భావిస్తున్నారు. రంగస్థలం ఖాతాలో మరో భారీ రికార్డ్ చేరింది. ఈ సినిమా తమిళనాట బాహుబలి 1 రికార్డ్‌ లను దాటేసింది. సమ్మె కారణంగా త‌మిళనాడులో చిత్రాలేవి విడుదల కాకపోవటం రంగస్థలంకు కలిసొచ్చింది.

చెన్నై నగరంలోనే కోటి రూపాయల షేర్‌ వసూళు చేసి సత్తా చాటింది రంగస్థలం.సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో స‌మంత హీరోయిన్‌గా చేసింది.ఈ సినిమాలో రాంచ‌ర‌ణ్ యాక్టింగ్‌కు అన్నీవైపుల నుండి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి.1980 నాటి క‌థ‌ను సుకుమార్ చాలా బాగా తెర‌క్కెకించారు.దేవిశ్రీప్ర‌సాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -