Monday, April 29, 2024
- Advertisement -

వారెవ్వా…… కొన్ని సెకండ్ల టీజర్‌తో రామలక్ష్మిని గుండెల్లో పెట్టుకునేలా చేశావ్‌గా సుక్కూ

- Advertisement -

రంగస్థలం సినిమా నుంచి రామలక్ష్మి టీజర్‌ని రిలీజ్ చేశాడు సుకుమార్. అందులో వింతేముంది సినిమా అన్నాక హీరో టీజర్, హీరోయిన్ టీజర్ అంటూ ఏదో ఒకటి వదుల్తూనే ఉంటారుగా అంటారా? అదీ నిజమే అనుకోండి. కానీ సుకుమార్ కూడా హీరోయిన్ టీజర్ అంటూ ఏదో ఒక రెగ్యులర్ వీడియో వదిలి ఉంటే మనం మాట్లాడుకోవడం ఎందుకు? కానీ సుకుమార్ మేజిక్ చేశాడు. పాత్రలనే ప్రధానంగా చేసుకుని నడిచే అర్జున్‌రెడ్డి లాంటి క్యారెక్టర్స్‌ని ప్రేక్షకుల గుండెల్లోకి పంపించడమే కష్టం. అలాంటిది రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో నటిస్తున్న సినిమాలో కొంత సేపు మాత్రమే కనిపించే అవకాశం ఉన్న హీరోయిన్ క్యారెక్టర్‌ని కూడా ప్రేక్షకుల గుండెల్లో నిలపొచ్చని ……..అది కూడా కేవలం సెకండ్స్ డ్యురేషన్ మాత్రమే ఉన్న టీజర్‌తో కూడా ఆ పాత్రను ప్రేక్షకుల మదిలో నిలిచపోయేలా నిరూపించొచ్చని నిరూపించాడు సుకుమార్.

క్రెడిట్ మొత్తం సుకుమార్‌కి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. రామలక్ష్మి క్యారెక్టర్‌ని సమంతా అక్కినేని కూడా అద్భుతంగా పోషించింది. ఆ నడక…వయ్యారం…..నవ్వు….చూపు……ఒకటేంటి అల్ట్రా మోడరన్ సిటీ అమ్మాయి సమంతా కాస్తా అచ్చమైన పదహారణాల పల్లెటూరి పడుచుగా మారపోయింది. ఇక ఈ పద్దెనిమిదేళ్ళ పడుచును వర్ణిస్తూ రామ్ చరణ్ చెప్పిన మాటలు….చెప్పిన విధానం కూడా ప్రేక్షకులందరూ రామలక్ష్మిని ప్రేమించేలా చేసింది. మొత్తంగా టీజర్‌‌లతోనే చిట్టిబాబు, రామలక్ష్మిలను ప్రేక్షకులు ప్రేమించేలా చేయడంలో సూపర్బ్‌ సక్సెస్ కొట్టాడు సుకుమార్. ఇక తెరపైన వీళ్ల కథ బోర్ కొట్టించకుండా సాగిపోయినా చాలు…..రంగస్థలం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్‌తో పాటు ప్రేక్షకుల ప్రేమను కూడా కొల్లగొట్టడం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -