Saturday, May 18, 2024
- Advertisement -

ర‌ణ్‌వీర్‌సింగ్ సూట్ విశేషం తెలుసుకోండి

- Advertisement -

బాలీవుడ్‌లో ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌త్యేక‌త ఉంది. విభిన్న వ‌స్త్ర‌ధార‌ణ‌తో అంద‌ర్నీ ఆక‌ట్టుకునే ర‌ణ్‌వీర్ ఇప్పుడు స‌రికొత్త సూట్ వేసుకున్నాడు. ఆయ‌న సూట్ విశేషం చూస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే!

డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ వంటి విషయాల్లో ప్ర‌త్యేక‌త చాటుకుంటున్నాడు. ఆదివారం (జ‌న‌వ‌రి 20) రాత్రి జరిగిన ఓ వేడుకలో రణ్‌వీర్ సింగ్ ఓ ప్ర‌త్యేక సూట్ ధ‌రించాడు. 1980 నుంచి 1990 మధ్యలో విడుదలైన తన ఫేవరెట్ బాలీవుడ్ సినిమాల పోస్ట‌ర్ల‌న్నింటినీ ఓ సూట్‌పై ప్రింట్ చేయించాడు. తన చిన్నతనం నుంచి రణ్‌వీర్‌కు సినిమాలంటే పిచ్చని తాను హీరో అయ్యేందుకు స్ఫూర్తినిచ్చిన హీరోలందరి గౌరవార్థం ఈ సూట్ ధరించాడు. ఈ డ్రెస్‌లో తమ అభిమాన హీరో రణ్‌వీర్‌ను చూసిన అభిమానులు మురిసిపోతున్నారు.

ప్ర‌స్తుతం రణ్‌వీర్ సింగ్ `పద్మావత్` సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో నటించాడు. ఈ సినిమా జ‌న‌వ‌రి 26వ తేదీన విడుదల కాబోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -