Friday, May 17, 2024
- Advertisement -

హిందూ దేవాలయాలు…… వైఎస్ కాలానికి చంద్రబాబు జమానాకి తేడా చూశారా?

- Advertisement -

చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్ళు అవుతున్న సందర్భంలో ప్రతి విషయంలోనూ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను చంద్రబాబు పాలనను పోల్చి చూసుకుంటున్నారు జనాలు. ఆ రకమైన పోలిక రావడానికి కూడా కారణం చంద్రబాబే. వైఎస్ ఉచిత విద్యుత్ హామీతో సహా అన్ని విషయాల్లోనూ వైఎస్‌ని కాపీ కొడుతున్న చంద్రబాబు ఆరోగ్యశ్రీ లాంటి పథకాలకు పేర్లు మార్చి కొనసాగిస్తున్నాడు. అయితే ఆయా పథకాల అమలు విషయంలో మాత్రం నానాటికీ తీసికట్టుగా పరిస్థితి తయారవుతోంది. మీకు తెలిసిన 108 ఉగ్యోగిని ఎవరినైనా అడిగి చూడండి……వైఎస్ పాలనలో ఎలా ఉందో…..బాబు పాలనలో ఎలా తగలడిందో వాళ్ళే సవివరంగా చెప్తారు.

ఆ విషయం పక్కనపెడితే వైఎస్‌లకు సంబంధించిన ప్రతి వ్యక్తిగత విషయంపైనా విషం చిమ్మారు పచ్చ బ్యాచ్. వైఎస్ క్రైస్తవాన్ని నమ్ముతాడు అన్న ఒక్క విషయాన్ని పట్టుకుని హిందూ వ్యతిరేకి చిత్రీకరించారు. తిరుమలతో సహా ఆలయాలన్నింటినీ భ్రష్టుపట్టిస్తున్నాడని విష ప్రచారం చేశారు. కానీ పూజారులకు రాయితీలు, జీతాల వ్యవస్థను ఏర్పాటు చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి అన్న విషయం మాత్రం చెప్పరు. ఇక తెలుగు నాట ఉన్న అన్ని దేవాలయాల్లోనూ ధూప, దీప, నైవేద్యాలు నిర్విరామంగా సాగాలన్న ఉద్ధ్యేశ్యంతో ప్రత్యేకంగా పథకం రూపొందించి ఫండ్స్ కేటాయించిన పాలకుడు వైఎస్పార్.

ఇప్పుడిక బాబు పాలన విషయానికి వద్దాం. ధూప, దీప, నైవేద్యం పథకానికి ప్రారంభంలోనే మంగళం పాడేశారు. రాజకీయాల పుణ్యమాని తిరుమల ఎంత భ్రష్టుపట్టిపోతుందో పచ్చ మీడియాలోనే వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. సంక్రాంతినాడు తిరుమలలో జై బాలయ్య, జై టిడిపి నినాదాలు…..బాబు బంధువుల హంగామాతో సామాన్య భక్తుల పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. ఇక దుర్గామాత సాక్షిగా సాగించిన క్షుద్ర, తాంత్రిక పూజల వ్యవహారం భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. చంద్రబాబు ప్రచారం కోసం మూడు పదుల సంఖ్యలో భక్తుల ప్రాణాలను ఫణంగా పెట్టిన పుష్కర ప్రమాదం మరిచిపోకముందే దుర్గమ్మసాక్షిగా సాగిన ఈ తాంత్రిక పూజలు హిందువుల్లో ఆగ్రహం రేకెత్తించాయి. కాణిపాకం ఆలయానికి ఇప్పటికీ పాలక వర్గం నియమించలేదు. టిడిపిలోనే ఇద్దరు ముగ్గురు నాయకులు పోటీ పడుతూ ఉండడంతో బాబు కాలక్షేపం చేస్తున్నారు. అన్నవరం, శ్రీకాళహస్తి ఆలయాల పాలక మండలి నియామకాలన్నీ రాజకీయ కంపు కొడుతున్నాయని బాబు భజన మీడియా ఈనాడులోనే తరచుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రముఖ ఆలయాలన్నీ కూడా ఇప్పుడు టిడిపి నేతల ఆధిపత్యంలోకి వెళ్ళిపోయాయని మఠాధిపతులే ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేవాలయాల పరిరక్షణ విషయంలో వైఎస్‌పై విషం చిమ్మినవాళ్ళు అధికారంలోకి వచ్చాక చేస్తున్న ఘనకార్యాలు ఇవి. కేవలం వైఎస్‌ల ప్రతిష్టను దెబ్బతీయాలన్న తాపత్రయమే గానీ దేవాలయాల పట్ల కనీస స్థాయి శ్రద్ధ కూడా లేదన్న విషయం మాత్రం చేతల్లో చాలా స్పష్టంగా నిరూపించుకున్నారన్నది కంటికి కనిపిస్తున్న నిజం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -