Sunday, May 19, 2024
- Advertisement -

చి.ల‌.సౌ సినిమా షూటింగ్ పూర్తి

- Advertisement -

న‌టుడిగా, హీరోగా న‌టిస్తూనే ద‌ర్శ‌క‌త్వం వైపు అడుగులు వేస్తున్నాడు రాహుల్ ర‌వీంద్ర‌న్‌. అత‌డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా చి.ల‌.సౌ. తేజ్ వీర్ నాయుడు సమర్పించు, సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై ఈ సినిమా నిర్మాణ‌మ‌వుతోంది. సుశాంత్ హీరోగా, రుహాని శర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ మొద‌లై కొన్ని రోజుల్లోనే పూర్తి చేసుకుంది. రాహుల్ రవీంద్రన్ పక్కా ప్ర‌ణాళిక‌తో అతి తక్కువ స‌మ‌యంలో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తి చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌ల్పిస్తోంది.

తొలిసారి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నా నిపుణుడి మాదిరి అతి త‌క్కువ స‌మ‌యంలో సినిమాను పూర్తి చేశారు. ప్ర‌స్తుతం ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్నారు. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. త్వరలో పాటలు విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. వేసవిలో సినిమాను విడుదల చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -