Tuesday, May 21, 2024
- Advertisement -

వెంకయ్య హోదా తెచ్చేశాడని 2014లో ఓట్లు కొల్లగొట్టారు…. గల్లా చించేశాడని 2019లో గెలుస్తారా?

- Advertisement -

రాష్ట్ర విభజన నాడు సీమాంద్ర ప్రజలందరూ కూడా రోదిస్తూ ఉంటే టిడిపి ఎంపిలు మాత్రం కామెడీ వేషాలు, డ్రామాలు ఆడారు. ఆ డ్రామాలకు సినిమా నటుడు శివప్రసాద్ సారథ్యం వహించాడు. జాతీయ స్థాయిలోనూ, ఇతర ఎంపిల ముందు ఈ జోకర్ వేషాల పుణ్యమా అని సమైక్యాంధ్ర పోరాటం కామెడీ అయిపోయింది. కానీ వెంకయ్య నాయుడు హోదా తెచ్చేశాడు అనే స్థాయిలో హంగామా చేసి ఓట్లు కొల్లగొట్టారు. మోడీని, చంద్రబాబుని గెలిపించడమే ఆలస్యం……ఆ వెంటనే పదిహేనేళ్ళ పాటు హోదా ఖాయం అని నమ్మించారు.

కట్ చేస్తే 2018లో నాలుగేళ్ళ తర్వాత బడ్జెట్‌లో మోడీ చిప్ప చూపిస్తే కూడా మళ్ళీ అవే డ్రామాలు. శివ ప్రసాద్ సారథ్యంలో అవే వేషాలు. రామ్ గోపాల్ వర్మలాంటి వాళ్ళు టిడిపి ఎంపీల ఈ జోకర్ వేషాల పుణ్యమాని ఆంధ్రప్రదేశ్ ప్రజల పరువు జాతీయ స్థాయిలో పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితేనేం మరోసారి ఆ జోకర్ వేషాలనే పోరాటంగా నమ్మించే ప్రయత్నం చేశారు. హోదా అంటూ వెంకయ్యను హీరోను చేసి బాబు, మోడీలకు ఓట్లు వేయించినట్టే ఈ సారి గల్లా జయదేవ్‌ని హీరోని చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆనాడు చెప్పుకోవడానికి హోదా అయినా ఉంది. ఈ సారి మాత్రం కేవలం పార్లమెంట్‌లో ఎంపిగా ఒక ప్రసంగం చేసినందుకు సన్మానాలు అంటూ షో చేస్తున్నారు. నిజంగా మోడీపై పోరాటం విషయంలో చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్ నాటి నుంచీ ఇప్పటి వరకూ చంద్రబాబు ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడకుండా ఉన్నట్టు? బాబు ఆవేశం, బాబు ఆగ్రహం, బాబు రంకెలు అంటూ పచ్చ మీడియాకు లీకులిస్తూ చాటున ఎందుకు ఉండిపోయినట్టు?

అదే అసలు డ్రామా. విభజన సమయంలో కూడా చంద్రబాబు ఇలానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంట్లో కూర్చున్నాడు. బాబు ఆవేదన, రగిలిపోతున్న బాబు అంటూ పచ్చ మీడియా ప్రజలను నమ్మించింది. సమైక్యాంధ్ర క్రెడిట్ కోసం తమవాడైన అశోక్ బాబుకి ఆరడుగుల ట్యాగ్ ఇచ్చి హంగామా చేసింది. బాబు మద్దతుతో కాలం గడిపేసిన కిరణ్ కుమార్ రెడ్డి కూడా బాబుకు సాయం చేశాడు. ఇక హోదా అనే బొమ్మ చూపించి వెంకయ్యను హీరోని చేసి టిడిపి, బిజెపిలకు సీమాంధ్రులు ఓట్లేసేలా రసవత్తరమైన నాటకం నడిపించారు. ఇప్పుడు గల్లా జయదేవ్, టిడిపి ఎంపిల వేషాలు, పవన్ కళ్యాణ్-జెపిల డ్రామాలతో మరోసారి అదే డ్రామాకు తెరలేపారు. 2019లో కూడా ఆంధ్రప్రదేశ్ ఓటర్లను మభ్యపెట్టగలరా? మళ్ళీ మళ్ళీ సీమాంధ్ర ఓటర్లను మోసం చేయగలరా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -