Saturday, May 4, 2024
- Advertisement -

‘కేజీఎఫ్ 2’లో రావు రమేష్ లుక్ రిలీజ్!

- Advertisement -

ఈ మద్య సినీమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ మూవీలు ఎక్కువగా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రూపొందిన కేజీఎఫ్ చిత్రం జాతీయ స్థాయిలో మంచి క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం ఈ చిత్రం సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇండియన్ సినిమా అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ యాక్షన్ పీరియాడిక్ డ్రామా చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”.

ప్రముఖ నటుడు రావు రమేశ్ పుట్టిన రోజును పురస్కరించుకుని సినిమా నుంచి మంగళవారం ఆయన లుక్ ను విడుదల చేశారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ కొన్నాళ్ల నుంచి కేజీయఫ్ టైమ్స్ అనే మ్యాగజైన్స్ ను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో తాను కన్నెగంటి రాఘవన్ అనే పాత్ర చేస్తున్నట్టు తెలిపారు. అలాగే తాను ఒక సిబిఐ ఆఫీసర్ గా రాకీ కేసును డీల్ చేసే స్పెషల్ ఆఫీసర్ గా కనిపించనున్నట్టు తెలిపారు.

ఇందులోనే సిబిఐ ఇంట్రెస్ట్ కేజీయఫ్ పై ఉందా లేక దాన్ని ఆధీనంలోకి తీసుకున్న రాకీ పై ఉందా అన్న మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. మరి ఇలా రావు రమేష్ పుట్టినరోజున మంచి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ను మేకర్స్ వదిలారు. ‘కెజిఎఫ్ చాప్టర్ 1’కి సీక్వెల్‌గా రూపుందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ‘అధీరా’ పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాను హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -