Friday, April 19, 2024
- Advertisement -

గుండె దమ్ము అంటూ.. హల్చల్ చేసిన అలీ రెజా!

- Advertisement -

అలీ రెజా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయినప్పటికీ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అలీ రెజా బిగ్ బాస్ హౌస్ లో చేసిన సందడి అటు బుల్లితెర ప్రేక్షకులను, ఇటు సోషల్ మీడియా ఫాలోవర్స్ ను ఆకర్షించి విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు.

తాజాగా అలీ రెజా పుట్టినరోజు సందర్భంగా ‘గుండెల్లో దమ్మున్న దోస్త్‌ ఖాజా భాయ్‌’ అంటూ G.D (G ఫర్‌ గుండె, D ఫర్‌ దమ్ము) సినిమా పోస్టర్‌ను రిలీజ్‌ చేశాడు. ఈడు ఎవని అయ్యకి వినడు, దోస్తులకు తప్ప అని రాసుకొచ్చాడు. అయితే తన ప్రయాణంలో ఏం జరగబోతుందనేది ఖాజా భాయ్‌కు కూడా తెలీదు అని పేర్కొన్నాడు. గుండెల్లో దమ్మున్న దోస్తులు అందరికోసం ఈ ఫస్ట్‌ లుక్‌ అని తెలిపాడు. ఈ మూవీని మిక్ మూవీస్, ఖారాబూందీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది.

Also read:మొదటి చిత్రం పెద్ద అద్భుతం అంటున్న కృతి సనన్..?

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అలీ రెజా ఇటీవలే నాగార్జున హీరోగా నటించిన వైల్డ్ డాగ్ మూవీలో మంచి స్కోప్ ఉన్న పాత్ర లో ఎన్‌.ఐ.ఎ ఏజెంట్ నటించాడు. తెలుగులో ఇప్పటికే గాయకుడు, సినీ మహల్ , నా రూటే సపరేట్ వంటి సినిమాల్లో హీరోగా నటించాడు.ఇప్పుడు తాజాగా వస్తున్న మూవీతో మరోసారి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడని చెప్పవచ్చు.

Also read:పవన్ కళ్యాణ్ బర్త్ డేకి బిగ్ బిగ్ సర్ప్రైజ్.. ఏంటో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -