Tuesday, May 14, 2024
- Advertisement -

మీడియాపై రెచ్చిపోయిన ర‌ష్మిక‌…వ్య‌క్తిగ‌త విష‌యాలు మీకెందుకు అని ప్ర‌శ్న‌

- Advertisement -

‘ఛ‌లో ‘సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచియ‌మైంది హీరోయిన్ ర‌ష్మిక‌.తొలి సినిమాతోనే హిట్ కొట్టిన ఈ భామ వెంట‌నే క్రేజీ ప్రోజెక్ట్స్‌లో ఛాన్స్‌లు కొట్టేసింది.విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి న‌టించిన గీతా గోవిందం సినిమా ర‌ష్మిక కెరీర్‌ను మార్చేసింది.ఆ సినిమాతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారింది.ఈ సినిమా త‌రువాత ర‌ష్మిక‌కు వ‌రస ఆఫ‌ర్లు వెల్లువెత్తాయి.ర‌ష్మిక ప్ర‌స్తుతం నానితో క‌లిసి న‌టించిన దేవ‌దాస్ సినిమా విడుద‌ల‌కు రెడీ అవుతుంది.ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో పాల్గొంది ర‌ష్మిక.సినిమా గురించిన విష‌యాల‌ను చెబుతున్న ర‌ష్మిక‌కు మీడియా నుంచి ఆమె నిశ్చితార్ధం రద్దు గురించి ప్ర‌శ్న ఎదురైంది.

దీంతో ర‌ష్మిక మీడియాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.సినిమా గురించి అడ‌గండి ఏదైన చెబుతాను కాని ,నా వ్య‌క్తిగ‌త విష‌యం మీకెందుకుని మీడియాని ప్ర‌శ్నించింది ర‌ష్మిక‌. కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించినరష్మిక అతడితో ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లికి రెడీ అయింది.ఏమైంది ఏమో కాని రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్‌ని ర‌ద్దు చేసుకుంది ర‌ష్మిక‌.దీనిపై ర‌ష్మిక ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు.ఏదైన ఉంటే సోష‌ల్ మీడియాలో మాట్లాడ‌తానంటూ మీడియా స‌మావేశం నుంచి వెళ్లిపోయింది ర‌ష్మిక‌.ఇక ఆమె న‌టించిన దేవ‌దాస్ సినిమా ఈ నెల 27న విడుద‌ల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -