Friday, May 10, 2024
- Advertisement -

వ‌న్డేల్లో అరుదైన ఘ‌న‌త సాధించిన రోహిత్ శ‌ర్మ‌..

- Advertisement -

డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా మరోసారి ఆసియా కప్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగిన సూపర్‌–4 మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్‌ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత కెప్టెన్ రోహిత్‌ శర్మ (119 బంతుల్లో 111 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇద్ద‌రూ సెంచ‌రీల‌తో క‌దం తొక్క‌డంతో సునాయాసంగా విజ‌యాన్ని న‌మోదు చేసింది.

ఈ మ్యాచ్‌లో సెంచ‌రీ చేసిన రోహిత్ శ‌ర్మ ఏడు వేల పరుగులు పూర్తి చేసిన తొమ్మిదో భారత ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 47 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో కేవలం 40 మంది బ్యాట్స్‌మెన్ మాత్రమే 7000 పరుగుల మైలురాయిని అందుకున్నారు.

విరాట్ కోహ్లీ 161 ఇన్నింగ్స్‌ల్లో, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 174 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ నమోదు చేయగా, రోహిత్ శర్మ 181 ఇన్నింగ్స్‌ల్లో 7 వేల క్లబ్‌లో చేరాడు. అయితే చిరకాల ప్రత్యర్థి పాక్‌పై, అది కూడా శతకం బాదిన వన్డేలో రోహిత్ ఈ ఘనత సాధించడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -