పుష్ప నుంచి రష్మిక ఫస్టులుక్…!

- Advertisement -

స్టైలిష్​ స్టార్​ అల్లు అర్జున్​.. క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్​ దర్శకత్వంలో పుష్ప సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ భారీ బడ్జెట్​తో తెరకెక్కుతోంది. పాన్​ఇండియా మూవీగా తీసుకొస్తున్నారు. అంతేకాక రెండు పార్ట్​లుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్​ సరసన రష్మిక నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్​ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతున్నట్టు టాక్​.

మొత్తానికి ఈ సినిమాపై విపరీతమైన హైప్​ క్రియేట్​ అయ్యింది. ఈ సినిమా టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నా ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టు సింగిల్ కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. అయితే ఈ సినిమాలో విలన్ గా మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో రష్మిక గిరిజన యువతిగా కనిపించనుందనే ఒక టాక్ వచ్చింది. ఒక వీడియోలోను ఒక ఫ్రేమ్ లో మెరిసింది. ఇక రేపు ఆమె ఫస్టులుక్ ను వదలడానికి రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 9:45 నిమిషాలకు ఈ సినిమా నుంచి ఆమె ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన ఒక ప్రకటనను చేశారు. ఈ సినిమాను ‘క్రిస్మస్’ కి రిలీజ్ చేయనున్నట్టు చెప్పినప్పటికీ, ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్టుగా చెబుతున్నారు.

Also Resd

గోవాలో పూరీ జగన్నాథ్ పుట్టినరోజు వేడుకలు..

టాలీవుడ్ హీరోయిన్స్ ఎక్కడ.. ఏం చదువుకున్నారో తెలుసా ?

సీనియర్ నటి లక్ష్మీ 3 పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణం ఇదే..!

తమకంటే పెద్దవారిని పెళ్లి చేసుకున్న సెలబ్రిటీస్

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -