చీర.. బొట్టు.. గాజులు.. పూలు.. హాట్ హాట్ గా రష్మికా ఫస్ట్ లుక్..!

- Advertisement -

క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్​ దర్శకత్వంలో స్టైలిష్​ స్టార్​ అల్లు అర్జున్ పుష్ప సినిమా భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అంతేకాక రెండు పార్ట్​లుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్​ సరసన రష్మిక నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్​ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు టాక్​.

మొత్తానికి ఈ సినిమాపై విపరీతమైన హైప్​ క్రియేట్​ అయ్యింది. ఈ సినిమా టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నా ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టు సింగిల్ కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. అయితే ఈ సినిమాలో విలన్ గా మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నాడు. ఫాహద్ ఫాజిల్ ఫస్టులుక్ కు మంచి స్పందన వచ్చింది.

తాజాగా రష్మికా మండన్న ఫస్టులుక్ ను ఉదయం 9:45 నిమిషాలకు రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఇందులో రష్మిక పుష్పరాజ్ లవర్ శ్రీవల్లి గా కనిపించనుంది. పోస్టర్ లో రష్మికా చీర .. బొట్టు .. గాజులు .. పూలు .. దగ్గర పెట్టుకుని హడావిడిగా ముస్తాబవుతు… కాస్త హాట్ గా కనిపిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమాను ‘క్రిస్మస్’ కి రిలీజ్ చేయనున్నట్టు చెప్పినప్పటికీ, ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్టుగా చెబుతున్నారు.

Also Read

టాలీవుడ్ హీరోయిన్స్ ఎక్కడ.. ఏం చదువుకున్నారో తెలుసా ?

బరువు తగ్గాలంటే.. ఉదయం ఇలా చేయండి.

సాయి పల్లవి గురించి మీకు తెలియని నిజాలు !

అందాన్ని మెరుగు పరిచే పండు..

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -