Sunday, April 28, 2024
- Advertisement -

కబీర్ సింగ్ తో ‘గీత గోవిందం’ బ్యూటీ

- Advertisement -

గత కొంతకాలంగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ లోనే సినిమాలు నిర్మిస్తున్న దిల్ రాజు ఇప్పుడు బాలీవుడ్లో సైతం అడుగుపెట్టనున్నారు. ఈ మధ్యనే బ్లాక్ బస్టర్ అయిన ‘ఎఫ్ 2’ సినిమాని హిందీలో బోని కపూర్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు దిల్ రాజు. తాజాగా దిల్ రాజు నాని ‘జెర్సీ’ సినిమా హిందీ రీమేక్ రైట్స్ కూడా కొనుగోలు చేశారు. అల్లు అరవింద్ తో కలిసి ‘జెర్సీ’ హిందీ రీమేక్ నిర్మించనున్నారు దిల్ రాజు.

తాజా సమాచారం ప్రకారం ఈ మధ్యనే ‘కబీర్ సింగ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న షాహిద్ కపూర్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో నడిచే ఈ ఎమోషనల్ డ్రామా సినిమాలో హీరోయిన్ గా రష్మీక ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే డియర్ కామ్రేడ్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న రష్మిక చేతిలో ప్రస్తుతం తెలుగు మరియు తమిళ ప్రాజెక్టులు ఉన్నాయి. తాజాగా ఈమె ఈ సినిమా ద్వారా బాలీవుడ్లో సైతం అడుగు పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -