Monday, May 6, 2024
- Advertisement -

జగన్ సంచలన నిర్ణయం…యరపతినేని కేసు సీబీఐకి అప్పగింత…

- Advertisement -

సీఎంగా వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ హయాంలో జరిగినభూకుంభకోణాలు,ఇసుక, మైనింగ్ కుంభకోణాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుపై రీవిర్స్ టెండరింగ్ కు వెల్లందేందుకు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. టిడిపి నేత మాజీ ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాస్ చేసిన అక్రమ మైనింగ్ కేసును విచారణ బాధ్యత సిబిఐకి అప్పగించాలని క్యాబినెట్ తీర్మానించింది.

పల్నాడులో ఆయన అక్రమంగా గనులను తవ్వి, వందల కోట్ల రూపాయలను వెనకేసుకున్నారని ఆరోపణలు రాగా, జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కేసులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.యరపతినేనిపై రాజకీయ కుట్ర జరుగుతోందని, ప్రతీకార రాజకీయాల్లో భాగంగా ఆయన్ను ఇబ్బందులు పెడుతున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తుండగా, వీటిని తిప్పి కొట్టేందుకే జగన్, ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

బాబు హయాంలో రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా బ్రేక్ లు వేసిన సంగతి తెలిసిందే. అయితే జగన్ అధికారంలోకి రాగానే సిబిఐ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.చంద్రబాబు హయాంలో జరిగిన వ్యవహారాల్లో దేనిపై జగన్ సిబిఐ విచారణకు ఆదేశిస్తారనే ఉత్కంఠ మొదలైంది.అక్రమ మైనింగ్ కేసును విచారించిన కోర్టు అవసరమైతే ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించవచ్చని సూచించింది.

టీడీపీ హయాంలో డిపి నేతలు చేసిన అడ్డదిడ్డమైన పనులతో, వ్యవహారాలతో కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే కొందరు అజ్ణాతంలో ఉన్నారు. అక్రమంగా జగన్ ప్రభుత్వం తమ నేతలపై కేసులు పెడ్తోందని గోల చేస్తున్నారు. అందుకనే యరపతినేని అక్రమమైనింగ్ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగిస్తే తమకు సమస్యలు ఉండవని క్యాబినెట్ అనుకున్నట్లు సమాచారం.

యరపతినేని అక్రమాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని, అందువల్లే సీబీఐకి ఈ బాధ్యతలను అప్పగిస్తున్నామని ప్రభుత్వ పెద్దలు వెల్లడించారు. ఇదే విషయాన్ని కేసులను విచారిస్తున్న హైకోర్టుకు తెలిపినట్టు పార్టీ నేత ఒకరు తెలియజేశారు.టిడిపి అధికారంలో ఉన్నపుడు యరపతినేని ఎంఎల్ఏ హోదాలో ఆకాశమే హద్దుగా అవినీతితో చెలరేగిపోయారు.ఈ నేపధ్యంలోనే అక్రమమైనింగ్ కేసును సిబిఐకి అప్పగించటం సంచలనంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -