Friday, May 3, 2024
- Advertisement -

లండన్ లోని భారత దౌత్య కార్యాలయంపై పాక్ జాతీయుల దాడి…

- Advertisement -

కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పిస్తోన్న ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా పాక్ ఇంకా తన అక్కసు వెల్లగక్కుతోనె ఉంది. తాజాగా లండన్ లోని భారత భారత హైకమిషనర్ కార్యాలయంపై పాక్ సంతతికి చెందిన బ్రిటన్ పౌరులు దాడి చేశారు.పాకిస్థాన్‌కు చెందిన కొందరు లండన్‌లోని భారత దౌత్య కార్యాలయం ఎదుట నిన్న నిరసనకు దిగారు. పీవోకే(పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌) జెండాలను ప్రదర్శిస్తూ.. పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు.

అంతేకాకుండా భారత రాయభారా కార్యాలయంపై దాడి చేసి కిటికీలను పగులగొట్టారు. భవనం యొక్క అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.‘కశ్మీర్ ఫ్రీడమ్ మార్చ్’ పేరిట బ్రిటిష్ కశ్మీరీ గ్రూపులు నిర్వహించిన ర్యాలీకి బ్రిటన్‌లోని అన్ని ప్రాంతాల నుంచి 10,000 మందికి పైగా పాకిస్థానీలు తరలివచ్చారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్, ఖలీస్థాన్ జెండాలతోపాటు ‘కశ్మీర్‌లో దాడులకు స్వస్తిపలకాలి’ ‘ఆక్రమణను అరికట్టాలి’ ‘కశ్మీర్ విషయంలో ఐరాస చర్యలు తీసుకోవాలి’ అనే నినాదాలు రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. దీనికి సంబంధించి ఇండియన్‌ హై కమిషన్‌ ట్వీట్‌ చేసింది ఈ ఘటనను లండన్‌ మేయర్‌ సాధిక్‌ ఖాన్‌ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి హేయమైన చర్య అని ఆయన అన్నారు. దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -